ఉట్నూర్ : ఏజెన్సీ ప్రాంతాల్లో తరతరాలుగా జీవిస్తోన్న షెడ్యూల్డ్ కులాల సంపూర్ణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పర్యావరణ, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. ఏజెన్సీ షెడ్యూల్డ్ కూలాల ఐక్య సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఉట్నూర్ మండల కేం ద్రంలోని స్టార్ ఫంక్షన్ హాలులో సన్మాన సభ నిర్వహిం చారు. మంత్రితో పాటు కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి, ఖానాపూర్, బోథ్, ఆ సిఫాబాద్ ఎమ్మెల్యేలు అజ్మీరా రేఖ, రాథోడ్ బాపురావు, కోవ లక్ష్మి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి తదితరులను సన్మానించారు.
మంత్రి రామన్న మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న షెడ్యూ ల్డ్ కులాల అభివృద్ధికి పూర్తిస్థాయిలో కృషి చేస్తానని అ న్నారు. ఏజెన్సీ చట్టాలతో ఇక్కడ నివాసం ఉంటున్న దళితులు పూర్తిస్థాయిలో హక్కులు పొందలేకపోతున్నారని వివరించారు. వారి భూములకు పట్టా, పహాణి ప త్రాలు ఇవ్వడం న్యాయమని పేర్కొన్నారు. దీనికి చర్య లు తీసుకుంటామని పేర్కొన్నారు. వేణుగోపాలాచారి మాట్లాడుతూ, షెడ్యూల్డ్ కులాల సమస్యలు జఠిలం కాకముందే పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి పక్షాలు అనవసర విమర్శలు మాని ప్రజా సమస్య ల పరిష్కారానికి ప్రభుత్వానికి కృషి చేయాలని సూచించారు.
షెడ్యూల్డ్ కులాల ఐక్య సమితి జిల్లా అధ్యక్షుడు కాంబ్లే నాందేవ్, ప్రధాన కార్యదర్శి మోతె రాజన్న, ఉపాధ్యక్షుడు మోతె నర్సింగరావు, ప్రచార కార్యదర్శి దావుల రమేశ్, అదనపు కార్యదర్శి కాటం రమేశ్, లక్కారం, ఉట్నూర్ సర్పంచులు మర్సకొల తిరుపతి, బొంత ఆశారెడ్డి, ఎంపీపీ విమల, జెడ్పీటీసీ జగ్జీవన్, నాయకులు భరత్ వాగ్మారే, దాసండ్ల ప్రభాకర్ పాల్గొన్నారు. కాగా, మండల పరిషత్ కార్యలయం ఆధ్వర్యంలోనూ ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు.
షెడ్యూల్డ్ కులాల అభివృద్ధికి కృషి
Published Mon, Jul 28 2014 12:23 AM | Last Updated on Sat, Sep 15 2018 3:59 PM
Advertisement
Advertisement