హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగ సంఘాలతో ప్రదీప్ చంద్ర కమిటీ గురువారం భేటీ కానుంది. ఈ సమావేశంలో ఉద్యోగుల పీఆర్సీ, ఫిట్ మెంట్లపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ప్రదీప్ చంద్ర కమిటీ చర్చించనుంది. అంతేకాకుండా ఉద్యోగులు తమ సమస్యలను ఈ సమావేశంలో కమిటీ ముందుంచే అవకాశం ఉంది.