మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను సచివాలయంలో కలిశారు.
హైదరాబాద్ : మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను సచివాలయంలో కలిశారు. గత కొంతకాలంగా ముత్యంరెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈనేపథ్యంలో ముత్యంరెడ్డిని అమెరికా పంపి వైద్యం చేయించాలని కేసీఆర్..అధికారులను ఆదేశించారు. ముత్యంరెడ్డి ప్రయాణ, వైద్య ఖర్చులకు అయ్యే వ్యయాన్ని తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుందని కేసీఆర్ తెలిపారు.