ఫోర్జరీ కేసులో మాజీ ఎమ్మెల్యే | EX-MLA Budida Bikshamaiah goud in forgery case | Sakshi
Sakshi News home page

ఫోర్జరీ కేసులో మాజీ ఎమ్మెల్యే

Published Sat, Sep 9 2017 4:11 PM | Last Updated on Tue, Sep 12 2017 2:22 AM

EX-MLA Budida Bikshamaiah goud in forgery case

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట మండలంలో 250 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసేందుకు సంతకాలు ఫోర్జరీ చేసిన కేసులో కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్యగౌడ్‌, ఆయన భార్య, కుమారుడు నిందితులుగా గుర్తించామని డీసీపీ యాదగిరి తెలిపారు. ఇందుకు సంబంధించి ముగ్గురుని అరెస్ట్‌ చేసి శనివారం మీడియా ముందు ప్రవేశపెట్టారు.
 
ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్యగౌడ్‌ సహా మరో ఏడుగురిపై కేసులు నమోదు అయ్యాయి. అయితే, భిక్షమయ్య గౌడ్‌, ఆయన భార్య సువర్ణ, కొడుకు ప్రవీణ్ ముందుగానే బెయిల్‌ పొందారు. నిపుణుల విచారణలో ఫోర్జరీ జరగడం వాస్తవమని తేలడంతో బెయిల్ రద్దు కోసం పిటిషన్ వేస్తామని డీసీపీ యాదగిరి తెలిపారు. మరో ఇద్దరిని తొందరలోనే పట్టుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement