ఎవరి ప్రయోజనాల కోసం రైతు సంఘాలు!
వీటి స్థానంలో చిన్నచిన్న పనిముట్లు ఇస్తే బాగుంటుంద న్నారు. వ్యవసాయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులు ఇజ్జత్‌గా బతికే పరిస్థితులు లేవన్నారు. అప్పుల కోసం బ్యాంకులకు వెళ్లే రైతులను బ్యాంకర్లు చిన్నచూపు చూస్తున్నారని, గట్టిగా మాట్లాడినా, ప్రశ్నించినా గెంటివేస్తున్నట్లు రైతులే చెబుతున్నారని కోదండరాం తెలిపారు. హైదరాబాద్‌లో ఈ నెల 17 నుంచి 28 వరకు స్వేచ్ఛా వాణిజ్య విధానంపై అంతర్జాతీయ సమావేశం జరగనుందన్నారు. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం అనే ఒప్పందంపై సదస్సు ఉంటుందని, 16 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారన్నారు. ఈ ఒప్పందంతో ఇక్కడి రైతులకు ఎంతో నష్టం జరగుతుందన్నారు.