
కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే ఆత్మహత్యలు
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు జరిగాయని టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆరోపించారు. శనివారం హైదరాబాద్లో రేవంత్ రెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... రైతుల ఆత్మహత్యలపై కేసీఆర్ కేంద్రానికి తప్పుడు నివేదిక ఇచ్చారని విమర్శించారు.
చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వికలాంగులు, వితంతువులను కేసీఆర్ అవమాన పరుస్తున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు.