![Fifteen Principles Against To Fight On Coronavirus Spreading - Sakshi](/styles/webp/s3/article_images/2020/06/23/docter.jpg.webp?itok=KYGtwAAe)
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా 15 జాగ్రత్తలతో కూడిన ఇలస్ట్రేటివ్ గైడ్ విడుదల చేసింది. ఈ సూత్రాల ఆధారం గా మనమంతా జాగ్రత్తగా ఉంటే కరోనాపై గెలుపు సాధిస్తామని సూచించింది. మరింత సులువుగా అర్థం చేసుకునేలా చిత్రాత్మక మార్గదర్శకాలను వైబ్‌సైట్‌లో ఉంచింది. దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నా యి. అత్యవసర పనులుంటే తప్ప బయటకు రావొద్దని, ముఖ్యంగా పదేళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వాళ్లు ఇల్లు విడిచి రావొద్దని మార్గదర్శకాల్లో కేంద్రం సూచించింది.
ఆ 15 సూత్రాలివే..
- పలకరింపును భౌతిక స్పర్శతో కాకుండా దూరంగా నమస్కారం చేయాలి.
- వ్యక్తికి, వ్యక్తికి మధ్య కనీసం 2 గజాల (6 అడుగులు) దూరాన్ని పాటించాలి.
- ముఖానికి మాస్కు ధరించాలి.
- కళ్లను, నోరు, ముక్కును చేతితో తాకకూడదు.
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల్లేకుండా పరిశుభ్రత చర్యలు పాటించాలి.
- చేతులను శానిటైజర్ లేదా సబ్బుతో శుభ్రం చేసుకోవాలి.
- బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడం, పాన్‌మసాలా తిని ఉమ్మివేయొద్దు.
- తరచుగా తాకే ప్రదేశాలు, వస్తువులను డిస్‌ఇన్ఫెక్ట్ చేయాలి.
- అనవసర ప్రయాణాలు మానుకోవాలి.
- ఇతరుల పట్ల వివక్ష చూపకూడదు.
- సమూహాలుగా గుమిగూడటం మానుకోవాలి.
- అసత్య వార్తలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయొద్దు.
- కరోనా సమాచారాన్ని విశ్వసనీయత కలిగిన వ్యక్తులు, సంస్థల నుంచి తెలుసుకోవాలి.
- సందేహాలుంటే జాతీయ హెల్ప్‌లైన్ 1075, రాష్ట్ర హెల్ప్‌లైన్ 104కు ఫోన్ చేయాలి..
- ఒత్తిడి, ఆత్రుతకు గురైతే నిపుణుల సహకారం తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment