సీఎం కేసీఆర్ సెక్యూరిటీ హెలీకాప్టర్కు తప్పిన ప్రమాదం | Fire accident at Lower Maneru dam | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్ సెక్యూరిటీ హెలీకాప్టర్కు తప్పిన ప్రమాదం

Published Wed, Dec 10 2014 5:14 PM | Last Updated on Sat, Sep 15 2018 8:43 PM

సీఎం కేసీఆర్ సెక్యూరిటీ హెలీకాప్టర్కు తప్పిన ప్రమాదం - Sakshi

సీఎం కేసీఆర్ సెక్యూరిటీ హెలీకాప్టర్కు తప్పిన ప్రమాదం

కరీంనగర్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు పర్యటనకు ముందు వచ్చిన సెక్యూరిటీ హెలీకాప్టర్కు పెను ప్రమాదం తప్పింది.  లోయర్ మానేరు డ్యామ్(ఎల్ఎండి) వద్ద సెక్యూరిటీ హెలీకాప్టర్ ల్యాండింగ్కు సిగ్నల్స్ కోసం పోలీసులు పొగపెట్టారు. అయితే అగ్గి రగిలి అక్కడ ఉన్న గడ్డివాము దగ్ధమైంది.

దాంతో అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను ఆర్పారు. దాంతో పెద్ద ప్రమాదం తప్పింది. అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement