
ఆర్టీసీ బస్సులో మంటలు : తప్పిన ప్రమాదం
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆర్టీసీ బస్సుకు మంగళవారం పెనుప్రమాదం తప్పింది.
యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆర్టీసీ బస్సుకు మంగళవారం పెనుప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న గరుడ బస్సులో ఆలేరు సమీపంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
మంటలను గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును రోడ్డు పక్కన నిలిపివేశాడు. బస్సులోని ప్రయాణికులు హుటాహుటిన కిందకు దిగారు. కొద్ది నిమిషాల్లోనే బస్సుకు మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణంగా తెలుస్తోంది. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది వచ్చే సమయానికే బస్సు దగ్ధమైంది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు.