అల్లా.. ఏ క్యా కియా..? | five people died in Nalgonda road Accident | Sakshi
Sakshi News home page

అల్లా.. ఏ క్యా కియా..?

Published Wed, Dec 31 2014 2:03 AM | Last Updated on Thu, Apr 4 2019 5:25 PM

అల్లా.. ఏ క్యా కియా..? - Sakshi

అల్లా.. ఏ క్యా కియా..?

 రాంగ్‌రూట్‌లో వచ్చి కారును ఢీకొన్న లారీ
 అక్కడికక్కడే ఐదుగురి మృతి...మరో చిన్నారి పరిస్థితి విషమం
 మృతులంతా వాడపల్లివాసులే..
  ఐదు నిమిషాలయితే..
 ఐదు నిండు ప్రాణాలు బలయ్యేవి కావు....
 మూడు కుటుంబాల్లో విషాదం నిండేది కాదు..
 వారంతా గమ్యస్థానాలకు చేరేవారు...
 కానీ అంతలోనే..
 మలుపు తిరిగేలోపే...యముడు తరిమినట్టుగా...
 రాంగ్‌రూట్‌లో వచ్చిన ఓ లారీ...కారును ఢీకొన్నది...
 ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు...
 స్నేహితుడి కోసమే వచ్చిన ఒకరు...
 బతుకుదెరువుకు  కారు నడుపుకునే మరొకరు...
 ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు.

 
 వారంతా అప్పటి వరకు వివాహ వేడుకలో పాల్గొని కారులో స్వగ్రామానికి తిరుగు పయనమయ్యారు.. మరో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుతామనేలోగా.. మృత్యువు రూపంలో వచ్చిన లారీ ఐదుగురిని కబళించేయగా.. మరో పసిప్రాయం మృత్యువుతో  పోరాడుతోంది..
 
 వాడపల్లి(దామరచర్ల): దామరచర్ల మండలం వాడపల్లి శివారులో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థాని కులు తెలిపిన వివరాల ప్రకారం.. వాడపల్లికి చెందిన అబ్దుల్ ఖలీల్ (29) స్థానికంగా హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి భార్య రిజ్వాన్ (25), కూతుళ్లు ఫరహానా (4), తహసిల్ ఉన్నారు. సోమవారం నల్లగొండ మండలం చర్లపల్లిలో జరుగుతున్న సమీప బంధువు వివాహానికి ఖలీల్ తన కుటుంబం, స్నేహితుడు పూజల సైదయ్య (20)తో సహా వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. సాయంత్రం కారంపుడి విజయ్ (30) కారులో అనుకున్నట్టుగానే ఖలీల్ కుటుంబం, అతడి స్నేహితుడు వివాహానికి వెళ్లారు.
 
 సరదగా గడిపి..
 చర్లపల్లిలో వివాహానికి వెళ్లిన ఖలీల్ కుటుం బం అందరితో కలివిడిగా గడిపింది. అర్ధరాత్రి దాటిన తరువాత 1 గంటకు భోజనం చేసి కారులో తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. ఇండియా సిమెంట్ ప్రధాన ద్వారం వద్దకు రాగానే అప్పటికే రాంగ్‌రూట్‌లో కోళ్లదానా (చిప్స్‌లోడు)తో వస్తున్న లారీ ఎదురుగా కారును ఢీకొట్టింది.
 
 ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, ఖలీల్ పెద్ద కుమార్తె తహసిల్‌కు  తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం ఇండియా సిమెంట్ ఫ్యాక్టరీ ఎదుటే జరగడంతో కార్మికులు వెంట నే అక్కడికి వచ్చారు. పోలీసులకు సమాచా రం ఇచ్చారు. సమీపంలోనే ఉన్న ఖలీల్ బం ధువులు కూడా వచ్చి తీవ్రంగా గాయపడిన తహసిల్‌ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆ స్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీడ్రైవర్ వాహనాన్ని అక్కడే నిలిపి పరారయ్యాడు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు వాడపల్లి ఎస్‌ఐ జానయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
 మృత్యువులోనూ వీడని స్నేహ బంధం
 వాడపల్లికి చెందిన పూజల గురువయ్య లక్ష్మమ్మలకు ఇద్దరు కుమారులుండగా సైదయ్య రెండోవాడు. అవివాహితుడైన సైదయ్య, అబ్దుల్ ఖలీల్ మంచి స్నేహితులు. నల్లగొండలో జరుగుతున్న తన సమీప బంధువు వివాహానికి వెళ్తామని ఖలీల్ కోరడంతో సైదయ్య కాదనలేక వెళ్లి మృత్యువాత పడ్డారు. మృత్యువు కూడా వారి స్నేహబంధాన్ని విడదీయలేకపోయిందని స్థానికులు చర్చించుకున్నారు.
 
 లారీ రాంగ్‌రూట్‌లో  రావడంతోనే...
 వాడపల్లి శివారు కృష్ణానది వెంట ఉన్న చిప్స్ పరిశ్రమ నుంచి అధికలోడుతో హైదరాబాద్‌కు వెళ్తున్న లారీ రాంగ్‌రూటే ప్రమాదానికి కారణమని తేలింది. అధిక లోడుతో ఉన్న లారీని రాష్ట్ర సరిహద్దులో ఉన్న చెక్‌పోస్టు వద్ద అధికారులు నిలిపివేస్తారని డ్రైవర్ డొంకమార్గాన్ని ఎంచుకుని ఉండాడని తెలుస్తోంది. డొందారిన వెళ్తున్న లారీ ఒక్కసారిగా అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపైకి రావడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్టు అవగతమవుతోంది.
 
 ‘మీరు తిని పడుకోండి’
 ‘నాకు ఆలస్యం అవుతుంది.. పిల్లలు.. నువ్వు తిని పడుకో’ అని రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో విజయ్ తన భార్య శైలజకు ఫోన్ చేసి చెప్పాడు. వాడపల్లి గ్రామానికి చెందిన కారంపూడి విజయ్‌కు ఆరేళ్ల క్రితం శైలజతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో విజయ్ కుటుంబ భారాన్ని మోస్తున్నాడు. కూలి చేసి పోగు చేసిన రూ. లక్షలతో ఇటీవలనే కారు కొనుగోలు చేసి అద్దెకు నడుపుడుతున్నాడు. ‘‘ నన్నూ .. పిల్లలను పడుకోమని చెప్పి.. నువ్వు శాశ్వతంగా నిద్రపోయావా.. నా దేవుడా’’ అంటూ శైలజ రోదించిన తీరు  కంటతడి పెట్టించింది.
 
 అల్లా.. ఏ క్యా కియా..?
 ప్రమాదంలో మృతిచెందిన ఖలీల్ కుటుంబం స్థానికంగా అందరితో కలివిడిగా జీవనం సాగించేది. ఖలీల్ తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో ఆమె తల్లి అహ్మద్‌బీ కష్టపడి పెద్ద చేసింది. ఖలీల్ హోటల్ నిర్వహిస్తూ, ఓ పార్టీ మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. జీవితంలో ఇప్పుడిప్పుడే ఓ స్థాయికి చేరుకుంటున్న క్రమంలో ‘ అల్లా ఏ క్యా కియా..? (దేవుడా ఎంత పనిచేశావు) అంటూ ఆ మాతృమూర్తి రోదించిన తీరు అందరినీ కలచివేసింది.
 
 కొత్త కారు కొన్న 20 రోజులకే....
 డ్రైవర్‌కమ్ ఓనర్ అయిన కారంపూడి విజయ్‌ది నిరుపేద కుటుంబమే. 20 రోజుల క్రితమే కొత్తకారు కొనుగోలు చేశాడు. ‘‘పెళ్లి కిరాయి కొచ్చా. నేనువచ్చేసరికి ఆలస్యమవుతుంది. మీరు తిని పడుకోండి’’ అంటూ భార్య శైలజ ఫోన్ చేశాడు. తెల్లారేసరికి  నా బతుకు తెల్లారిపోయిందంటూ  శైలజ రోదిస్తున్న తీరు పలువురిని కలిచివేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement