రైతు హత్య
పుల్‌కల్, న్యూస్‌లైన్ : భూమి, బోరు విషయంలో దా యాదులు దాష్టికానికి ఒడిగట్టారు. అన్న ఎదుటే తమ్ముడిని చెట్టుకు కట్టేసి ఉరేసి మట్టుబెట్టారు. ఈ సంఘటన మండలంలోని మిన్‌పూర్ గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షి అయిన మృతుడి అన్న అం జయ్య, పోలీసుల కథనం మేరకు.. గ్రా మానికి చెందిన అంజయ్య, సామయ్య లు వ్యవసాయం చేసుకుంటూ కుటుం బాన్ని పోషిస్తున్నారు. అయితే వీరికి పా లివారైన శ్రీరాములు, శంకరయ్య, సామయ్య, వినోద్, అంజయ్యల మధ్య భూమి, వ్యవసాయ బోరు విషయంలో వివాదం నడుస్తోంది. ఈ విషయంలో పలుమార్లు పోలీసులను, రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. దీంతో రెవెన్యూ అధికారులు వీరి మధ్య ఉన్న భూమి కొలతలు కొలిచి ఎవరి హద్దులు వారికి చూపించారు.
అయితే భూ పంపకంలో ఉన్న వ్యవసాయ బోరు తమకే కావాలని సామయ్య పాలి వారు పట్టుబట్టారు. కానీ ఆ బోరు నా భాగానికి వచ్చిన స్థలంలో ఉందని అది తనకే చెం దుతుందని, ఎవరికీ ఇవ్వనని సామ య్య మొండికేశాడు. ఈ విషయంలో గ్రామ పెద్దలు పంచాయితీ పెట్టి బోరు తీసుకునే వారు రూ. లక్ష ఇవ్వాలని తీ ర్పు ఇచ్చారు. దీంతో సామయ్య డబ్బు లు ఇస్తానని ఒప్పుకున్నాడు. ఆ డబ్బు లు ఇచ్చే సమయం రావడంతో మళ్లీ వారి మధ్య ఘర్షణ జరిగాయి. ఈ విషయమై సామయ్య డబ్బులు కట్టేందుకు సిద్ధమయ్యాడు. ఇది గమనించిన సామ య్య పాలివారు శ్రీరాములు, శంకర య్య, సామయ్య, వినోద్, అంజయ్య గురువారం సామయ్యతో మళ్లీ ఘర్షణ పడ్డారు. అర్ధరాత్రి సమయంలో ఇంటి వద్దకు వచ్చి సామయ్య తల్లి బాలమ్మను కొట్టి, సామయ్య, అతడిని అన్న అంజ య్యను పోలీస్ స్టేషన్ పోదామంటూ తీసుకెళ్లారు. అయితే స్టేషన్‌కు వెళ్లకుండా తమ వ్యవసాయ పొలం వద్దకు వెళ్లారు. అక్కడ అంజయ్యను చెట్టుకు కట్టేశారు. అనంతరం సామయ్యను పడుకోబెట్టి మెడకు వైరును బిగించి తలపై బలంగా కొట్టి చంపారు. శుక్రవారం ఉదయం జోగిపేట సీఐ రవికుమార్, పుల్‌కల్ ఎస్‌ఐ లోకేష్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
అనంతరం సామయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి అన్న అంజయ్య ఫిర్యాదు మేరకు పాలివారైన శ్రీరాములు, శంకరయ్య, సామయ్య, వినోద్, అంజయ్య, శ్రీరాములు భార్య నరసమ్మ, శంక రయ్య భార్య సుశీల, రామయ్య భార్య అమృత, అంజయ్య భార్య భాగ్యవతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే నిందితులు పరారీలో ఉన్నట్లు వారు పేర్కొన్నారు. మృతుడి భార్య రెండేళ్ల క్రితమే రోడ్డు ప్రమాదంలో చనిపోగా, కుమార్తె చంద్రకళ ఉంది.