మహబూబ్నగర్: రాజకీయ దురహంకారంతోనే టీఆర్ఎస్ పార్టీ ఇష్టం వచ్చినట్టు వ్యహరిస్తుందని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్.రామచంద్రరావు ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట వచ్చిన ఆయన మాట్లాడుతూ... బంగారు తెలంగాణ కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా అత్యధిక మెజారిటీతో తనను గెలిపించాలని ఆయన కోరారు.