గుప్తనిధుల కోసం తవ్వకాలు.. చితకబాదిన గ్రామస్థులు | gang in mahaboob nagar for funds | Sakshi
Sakshi News home page

గుప్తనిధుల కోసం తవ్వకాలు.. చితకబాదిన గ్రామస్థులు

Published Sun, Jul 5 2015 12:44 PM | Last Updated on Mon, Oct 8 2018 4:59 PM

gang in mahaboob nagar for funds

మహబూబ్‌నగర్: గుర్తు తెలియని ముఠా దేవాలయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు నిర్వహించిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాల మండలం నక్కలపల్లి గ్రామ శివారులోని అడవి ఆంజనేయ స్వామి దేవాలయంలో శనివారం రాత్రి జరిగింది.

ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకొని తవ్వకాలు చేపడుతున్న వ్యక్తులను పట్టుకున్నారు. ఈ క్రమంలో ముగ్గురు దుండగులు గ్రామస్తుల చేతికి చిక్కగా.. మరో నలుగురు పరారయ్యారు. చేతికి చిక్కిన వారికి దేహశుద్ధి చేసిన స్థానికులు పోలీసులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement