సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల నిర్మాణ బాధ్యతలు తెలంగాణ రాష్ట్ర విద్యుదు త్పత్తి సంస్థ(జెన్‌కో)కే తిరిగి అప్పగిం చాలని ప్రభుత్వానికి నీటిపారుదల శాఖ లేఖ రాసింది. గోదావరి నదిపై జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల నిర్మాణ బాధ్యతలు నీటిపారుదల శాఖకు అప్ప గిస్తూ 2010 మార్చి 11న ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 21ను పునః సమీక్షించాలని కోరింది. బహుళార్థక ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా నీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో డ్యాం లు, జెన్‌కో ఆధ్వర్యంలో జల విద్యుదుత్పత్తి కేంద్రాలు నిర్మించడం ఆనవాయితీ.
జల విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్మాణం, డిజైన్ల రూపకల్పన, నిర్వహణలో జెన్‌కోకు విస్తృత అనుభవం ఉంది. అయితే, గోదావరిపై జెన్‌కో కొత్త జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టేందుకు జీవో 21 అడ్డుగా ఉంది. దీంతో పాత ఉత్తర్వులు సవరించి తుపాకులగూడెం జల విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు అప్పగించాలని జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ లేఖపై నీటిపారుదల శాఖ అభిప్రాయాన్ని ప్రభుత్వం కోరగా ఆ శాఖ ఈఎన్‌సీ సానుకూలంగా స్పందించారు.
పూర్తయిన దిగువ జూరాల..
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జెన్‌కో ఆధ్వర్యంలో దిగువ జూరాల, పులిచింతల జల విద్యుత్ కేంద్రాల నిర్మాణ పనులు చేపట్టగా ఇప్పటికే దిగువ జూరాల ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. పులి చింతల విద్యుదుత్పత్తి కేంద్రం పను లూ చివరిదశలో ఉన్నాయి. ఈప్రాజెక్టు పూర్తయితే జెన్‌కో చేతిలో జల విద్యుత్ కేంద్రాల నిర్మాణాల పనులండవు.
జలవిద్యుత్ ప్రాజెక్టులు జెన్‌కోకే ఇవ్వండి
Published Mon, Mar 5 2018 12:43 AM | Last Updated on Mon, Mar 5 2018 12:43 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment