Genco CMD prabhakar rao
-
ఏ రాష్ట్ర ఉద్యోగులు ఆ రాష్ట్రంలోనే పని చేయాలి
సాక్షి, హైదరాబాద్: స్థానికత ప్రతిపాదికన ఏ రాష్ట్ర ఉద్యోగులను ఆ రాష్ట్రంలోనే కొనసాగించాలని, ఒక వేళకాదని ఆంధ్ర ఉద్యోగులను తెలంగాణ విద్యుత్ సంస్థల్లో విలీనం చేయాలని చూస్తే మలిదశ తెలంగాణ పోరాటానికి కూడా వెనుకాడబోమని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్, తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్, తెలంగాణ విద్యుత్ ఎకౌంట్ ఆఫీసర్స్ అసోసియేషన్లు కోరాయి. సమస్య జటిలం కాకముందే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విషయంపై తుది నిర్ణయానికి రావాలని అల్టిమేటం జారీ చేశాయి. ఈ మేరకు తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎన్. శివాజీ, మధుసూదన్ రెడ్డి, తెలంగాణ ఎలక్ట్రికల్ ఎకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకుడు అంజయ్య సంయుక్తాధ్వర్యంలో బుధవారం ఎర్రగడ్డ జెన్కో ఆడిటోరియంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఇదే అంశంపై తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.రత్నాకర్‌రావు, కార్యదర్శి సదానందం అధ్యక్షతన ఆ సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించి, తీర్మా నం ప్రతిని జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల ప్రతినిధు లు వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. ఏపీ విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న ఆంధ్ర ఉద్యోగులను ఆప్షన్ల పేరుతో తెలంగాణ విద్యుత్ సంస్థల్లోకి తెచ్చే కుట్ర జరుగుతోందని, ఏపీ ప్రతిపాదనను తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోరని వారు స్పష్టం చేశారు. ఏపీ విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న 229 మంది తెలంగాణ ఉద్యోగులను తెలంగాణ సంస్థల్లో చేర్చుకున్నట్లే.. ఆంధ్ర స్థానికత గల 1157 మంది విద్యుత్ ఉద్యోగులను ఏపీ విద్యుత్ సంస్థల్లో చేర్చుకోవాలన్నారు. తమ అభీష్టానికి విరుద్ధంగా ముఖ్యమంత్రులు వ్యవహరిస్తే..వారికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కిరణ్‌కుమార్, వెంకటనారాయణ, జనప్రియ, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
కరెంట్ సరఫరాకు ‘తిత్లీ’ షాక్ !
సాక్షి, హైదరాబాద్: కరెంటు సరఫరాకు తిత్లీ తుపాన్ దెబ్బ తగిలింది. తిత్లీ తుపాన్ సృష్టించిన బీభత్స ప్రభావం దేశ వ్యాప్తంగా, ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరాపై పడింది. తీవ్ర వేగంతో వీచిన ఈదురుగాలులతో దేశంలోని ఉత్తర–దక్షిణ ప్రాంతాల మధ్య విద్యుత్ కారిడార్ (విద్యుత్ సరఫరా లైన్లు) దెబ్బతింది. తాల్చేరు–కోలార్, అంగూల్–శ్రీకాకుళం లైన్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీనితో ఉత్తరాది నుంచి తెలంగాణకు రావాల్సిన 3,000 మెగావాట్ల విద్యుత్ అకస్మాత్తుగా నిలిచింది. సగటున రాష్ట్రంలో స్థిరంగా 10,500 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు అవుతోంది. తాజాగా పరిణామాలు ప్రభావం చూపే అవకాశముంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుదుత్పత్తి, సరఫరా అంశాలపై కేసీఆర్ శనివారం ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావుతో సమీక్షించారు. ఉత్తర భారత్ నుంచి రావాల్సిన విద్యుత్ పూర్తిగా ఆగిపోయిందని, బహిరంగ మార్కెట్లో కొనుగోళ్లూ నిలిచిపోయాయని ప్రభాకర్‌రావు వివరించారు. ఈ పరిస్థితి ఎదుర్కొని రాష్ట్రంలో అన్ని రంగాలకు నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగించేందుకు థర్మల్, హైడల్ విద్యుత్ కేంద్రాల్లో పూర్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ఏర్పడిన పరిస్థితిని సమర్థంగా ఎదుర్కోవాలని సీఎం ఆదేశించారు. దెబ్బతిన్న విద్యుత్ లైన్ల పునరుద్ధరణకు మరో రెండు, మూడు రోజుల సమయం పట్టే అవకాశముందని, ఆ మేరకు సరఫరాలో కొరత ఏర్పడవచ్చని ప్రభాకర్‌రావు తెలియజేశారు. రాష్ట్రంలోని విద్యుదుత్పత్తి కేంద్రాల నుంచి తప్పా బయట నుంచి విద్యుత్ వచ్చే పరిస్థితి లేదని వివరించారు. రాష్ట్రానికి 3 వేల మెగావాట్ల విద్యుత్ కొరత ఉందని వెల్లడించారు. వచ్చే 3 రోజులు దక్షిణ భారత దేశంలో విద్యుత్ సరఫరాలో సమస్యలు ఏర్పడే అవకాశముందన్నారు. తెలంగాణలో కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశముందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్ రాకున్నా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నామని కేసీఆర్‌కు ప్రభాకర్‌రావు వివరించారు. -
రెండేళ్లలో 3,480 మెగావాట్ల ఉత్పత్తి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పడిన అనంతరం నిర్మిస్తున్న విద్యుత్ కేంద్రాల్లో వచ్చే నెల నుండే ఉత్పత్తి ప్రారంభమవుతుందని, రెండేళ్లలో అదనంగా 3,480 మెగావాట్లు, ఆ తరువాత రెండేళ్లలో మరో 4,000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం అందుబాటులోకి వస్తుందని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి. ప్రభాకర్ రావు వెల్లడించారు. జెన్కో ఆధ్వర్యంలో చేపట్టిన 800 మెగావాట్ల కేటీపీఎస్ ఏడోదశ విద్యుదుత్పత్తి కేంద్ర నిర్మాణం పూర్తయిందని, వచ్చే నెల నుండి ఉత్పత్తి ప్రారంభిస్తామని చెప్పారు. 1080 (4గీ270) మెగావాట్ల భద్రాద్రి ప్లాంట్‌కు సంబంధించి తొలి రెండు యూనిట్లు వచ్చే ఏడాది మార్చి, మరో రెండు యూనిట్లు డిసెంబర్ నుండి ఉత్పత్తిని ప్రారంభిస్తాయన్నారు. ఎన్టీపీసీ, యాదాద్రి, భద్రాద్రి, కేటీపీఎస్ ఏడో దశ విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్మాణ పురోగతిని శుక్రవారం ఆయన విద్యుత్ సౌధలో సమీక్షించారు. ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దూబె, జనరల్ మేనేజర్ సుదర్శన్, ట్రాన్స్ కో జేఎండీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 2020 నాటికి 20 వేల మెగావాట్లు ఎన్టీపీసీ, భద్రాద్రి, కేటీపీఎస్ ద్వారా 2020 మార్చి నాటికి అదనంగా 3,480 మెగావాట్ల విద్యుదుత్పత్తి అందుబాటులోకి వస్తుందని ప్రభాకర్‌రావు తెలిపారు. దీంతో రాష్ట్రంలో విద్యుదుత్పత్తి 20,000 మెగావాట్లు దాటుతుందన్నారు. 4000 మెగావాట్ల యాదాద్రి ప్లాంటును కూడా నిర్మిస్తామన్నారు. సోలార్, హైడల్, సీజీఎస్ తదితర మార్గాల ద్వారా కూడా 28,000 మెగావాట్ల విద్యుదుత్పత్తిని సాధించడానికి కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. శరవేగంగా రామగుండం ప్లాంట్ పనులు రామగుండంలో 4000 మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుదుత్పత్తి ప్లాంట్ నిర్మాణం జరగాల్సి వుండగా మొదటి దశలో 1600 (2గీ800) మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు యూనిట్ల నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎన్టీపీసీ ఏఈ దూబె తెలిపారు. తొలి యూనిట్ ద్వారా వచ్చే ఏడాది నవంబర్ నుండి 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్రారంభిస్తామన్నారు. ఆ తరువాత మూడు నెలలకు మరో 800 మెగావాట్ల ఉత్పత్తి ప్రారంభమవుతుందని వెల్లడించారు. -
జలవిద్యుత్ ప్రాజెక్టులు జెన్‌కోకే ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల నిర్మాణ బాధ్యతలు తెలంగాణ రాష్ట్ర విద్యుదు త్పత్తి సంస్థ(జెన్కో)కే తిరిగి అప్పగిం చాలని ప్రభుత్వానికి నీటిపారుదల శాఖ లేఖ రాసింది. గోదావరి నదిపై జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల నిర్మాణ బాధ్యతలు నీటిపారుదల శాఖకు అప్ప గిస్తూ 2010 మార్చి 11న ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 21ను పునః సమీక్షించాలని కోరింది. బహుళార్థక ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా నీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో డ్యాం లు, జెన్కో ఆధ్వర్యంలో జల విద్యుదుత్పత్తి కేంద్రాలు నిర్మించడం ఆనవాయితీ. జల విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్మాణం, డిజైన్ల రూపకల్పన, నిర్వహణలో జెన్కోకు విస్తృత అనుభవం ఉంది. అయితే, గోదావరిపై జెన్కో కొత్త జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టేందుకు జీవో 21 అడ్డుగా ఉంది. దీంతో పాత ఉత్తర్వులు సవరించి తుపాకులగూడెం జల విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు అప్పగించాలని జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ లేఖపై నీటిపారుదల శాఖ అభిప్రాయాన్ని ప్రభుత్వం కోరగా ఆ శాఖ ఈఎన్సీ సానుకూలంగా స్పందించారు. పూర్తయిన దిగువ జూరాల.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జెన్కో ఆధ్వర్యంలో దిగువ జూరాల, పులిచింతల జల విద్యుత్ కేంద్రాల నిర్మాణ పనులు చేపట్టగా ఇప్పటికే దిగువ జూరాల ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. పులి చింతల విద్యుదుత్పత్తి కేంద్రం పను లూ చివరిదశలో ఉన్నాయి. ఈప్రాజెక్టు పూర్తయితే జెన్కో చేతిలో జల విద్యుత్ కేంద్రాల నిర్మాణాల పనులండవు. -
విద్యుత్ ప్లాంట్లకు వడ్డీలో రాయితీ
జెన్కోకు రూ.400 కోట్లు ఆదా - 1 శాతం వడ్డీ తగ్గించేందుకు రుణ సంస్థల అంగీకారం - జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు వెల్లడి సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల నిర్మాణానికి ఒక శాతం వడ్డీ తగ్గించి రుణ సౌకర్యం కల్పించేందుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) సంస్థలు ముందుకొచ్చాయని జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు. ఈ సం స్థలు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి 10.5 శాతానికి పైగా వడ్డీగా విధిస్తారని, కానీ తెలంగాణ జెన్కోకు మాత్రం 9.65 శాతం వడ్డీకే రూ.40 వేల కోట్ల రుణం అందిస్తున్నాయన్నారు. దీంతో రూ.400 కోట్లు పొదుపు అవుతాయన్నారు. విద్యుత్ సంస్థ లు పాటిస్తున్న నాణ్యత ప్రమాణాలు, ప్లాంట్ల నిర్మాణంలో పారదర్శకత తదితర ప్రామాణికాలను పరిగణనలోకి తీసుకుని వడ్డీ రేట్లు తగ్గించాయన్నారు. రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చడానికి జెన్కో ఆధ్వర్యంలో 6వేల మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ప్లాంట్లను నెల కొల్పుతున్నామన్నారు. యాదాద్రి ఆల్ట్రా మెగా పవర్ ప్లాంటు 5వ యూనిట్ నిర్మా ణానికి రూ.4.009 కోట్ల రుణం విషయం లో పీఎఫ్సీ ప్రతినిధులతో విద్యుత్ సౌధలో సీఎండీ ప్రభాకర్‌రావు, అధికా రులు సోమవారం సమావేశమయ్యారు. 4 వేల మెగావాట్ల యాదాద్రి పవర్ ప్లాంటు నిర్మాణానికి రూ.25 వేల కోట్లు, 1,080 మెగావాట్ల మణుగూరు ప్లాంటుకు రూ.7,600 కోట్లు, 800 మెగావాట్ల కొత్తగూడెం 7వ యూనిట్‌కు రూ.6,800 కోట్లు, 120 మెగావాట్ల పులిచింతల ప్లాంటుకు రూ.680 కోట్లు అంచనా వ్యయంగా ఉందన్నారు. పవన విద్యుదుత్పత్తికి అవకాశం రాష్ట్రంలో 4,500 మెగావాట్ల పవన విద్యు దుత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు అవకాశముందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ అధ్యయనంలో వెల్లడైం దని ప్రభాకర్‌రావు, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాస్‌రావు తెలిపారు. ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో పవన విద్యుదుత్పత్తికి అనుకూల ప్రాంతాలను గుర్తించామని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆమోదిస్తే త్వరలో పవన విద్యుత్ విధానాన్ని ప్రకటిస్తామని చెప్పారు. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో విద్యుత్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ నెల 25వ తేదీనే వేతనాలు చెల్లించాలని నిర్ణయించినట్లు ప్రభాకర్‌రావు వెల్లడించారు. -
ఏఈల భర్తీలో ప్రతిభే గీటురాయి
సాక్షి, హైదరాబాద్: అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) ఉద్యోగాల భర్తీలో పైరవీలు జరుగుతున్నాయని, కొందరు దళారులు డబ్బులు వసూలు చేస్తున్నారని వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) సీఎండీ డి.ప్రభాకర్ రావు స్పష్టంచేశారు. రాతపరీక్షలో ప్రతిభ ఆధారంగానే ఏఈల ఎంపిక నిర్వహిస్తామన్నారు. జెన్కో నిబంధనలు, రిజర్వేషన్లకు లోబడి నియామకాలు ఉంటాయని చెప్పారు. సోమవారం విద్యుత్ సౌధలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరు వ్యక్తులు చేసే మోసపూరిత హామీలను నమ్మవద్దని అభ్యర్థులను హెచ్చరించారు. ఎవరైనా అభ్యర్థులు దళారుల సహాయంతో ఉద్యోగం పొందేందుకు ప్రయత్నిస్తే 8332983914 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. రుజువులుంటే క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జెన్కోలో 856 ఏఈ పోస్టుల భర్తీకి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. దరఖాస్తుల స్వీకరణ బాధ్యతలను సుపరిపాలన కేంద్రం (సీఈజీ)కు, రాత పరీక్ష నిర్వహణను జేఎన్టీయూ-హైదరాబాద్‌కు అప్పగించామన్నారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం 1,09,907 మంది అభ్యర్థులు రాతపరీక్షకు అర్హులుగా తేలారన్నారు. ఈ నెల 14న హైదరాబాద్‌లోని 75 కేంద్రాల్లో నిర్వహించిన రాతపరీక్ష ప్రశాంతంగా ముగిసిందన్నారు. రామంతాపూర్‌లోని ఓ కేంద్రంలో వికలాంగుడైన ఓ అభ్యర్థి బ్లూటూత్ ద్వారా కాపీ కొట్టేందుకు ప్రయత్నిస్తే పట్టుకుని పోలీసులకు అప్పగించామన్నారు. ఆ అభ్యర్థిపై క్రిమినల్ కేసు నమోదు చేశామన్నారు. ఈ ఒక్క ఘటన మినహా ఇతర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదన్నారు. రాతపరీక్ష కీ విడుదల ఈ నెల 14న జరిగిన జెన్కో ఏఈ పరీక్ష ప్రశ్నపత్రాల కీని సోమవారం జేఎన్టీయూ హెచ్ విడుదల చేసింది. ఈ నెల 18లోపు అభ్యంతరాలు తెలపాలని జెన్కో యాజమాన్యం సూచించింది. convener.aert2015@gmail.comకు మెయిల్ చేయాలని కోరింది. -
మూడేళ్ల తర్వాతే నిరంతర విద్యుత్: జెన్కో సీఎండీ
వరంగల్: రాష్ట్రంలో మూడేళ్ల తర్వాతే నిరంతర విద్యుత్ సరఫరా వీలవుతుందని జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు. వరంగల్ నగర శివారులోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్మించిన 100 కేవీ సౌర విద్యుత్ ప్లాంట్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ర్టంలో 150 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం ఉండగా 130 మిలియన్ యూనిట్లు మాత్రమే అందిస్తున్నట్లు తెలిపారు.