
సాక్షి, హైదరాబాద్: వక్ఫ్ భూముల లెక్క పక్కా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటివరకు అడ్డదిడ్డంగా ఉన్న వక్ఫ్ రికార్డులను సరిచేయడంతో పాటు భూ రికార్డుల ప్రక్షాళనలో వాటిని పకడ్బందీగా నమోదు చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు ఉత్తర్వులు అం దాయి. ఈ మేరకు వక్ఫ్ బోర్డు పక్షాళన తుది నోటిఫికేషన్ ఉన్న భూములనే వక్ఫ్ భూము లుగా నమోదు చేస్తున్నారు. ప్రాథమిక నోటి ఫికేషన్ అనంతరం ముసాయిదాలో ఉండి తుది నోటిఫికేషన్ ద్వారా గెజిట్‌లో పబ్లిష్ అయిన భూముల వివరాలను మాత్రమే వక్ఫ్ కోటాలో ఉంచుతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్ భూములు 25–30 వేల ఎకరాల వరకు తేలే అవకాశం ఉందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
కుదరని పొంతన
వాస్తవానికి, వక్ఫ్ భూముల విషయంలో రెవెన్యూ, వక్ఫ్ అధికారులకు కూడా పొంతన కుదరడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 75 వేలకు పైగా ఎకరాల భూమి తమకుం దని వక్ఫ్‌బోర్డు అధికారులు అంటుంటే.. వక్ఫ్‌భూములు 30 వేల ఎకరాలకు మించ వని రెవెన్యూ శాఖ అంటోంది. వక్ఫ్ ఆస్తుల కింద ఉన్న భూములు రాష్ట్రంలో 75 వేల ఎకరాలు ఉంటాయనే మరో లెక్క కూడా ఉంది. ఇందులో 57వేల ఎకరాలు కబ్జాకు గురవడంతో పాటు ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారని కొన్ని సర్వేల్లో తేలింది. దీని ప్రకారం మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎక్కువగా ఆక్రమణలున్నాయి. మిగిలిన చోట్ల ఆక్రమణ లు న్నా, వక్ఫ్ భూములు కూడా తక్కువే ఉన్నా యి. దీంతో అసలు భూ ప్రక్షాళన అనంతరం వక్ఫ్ భూములు ఎన్ని వేల ఎకరాలు తేలుతుందనే దానిపై ఆసక్తి నెలకొంది.