Waqf lands
-
వక్ఫ్ ఆస్తుల ఆక్రమణదారులపై కొరడా
సాక్షి, అమరావతి: మహోన్నత ఆశయంతో దాతలు ఇచ్చిన వక్ఫ్ భూములు, ఆస్తులను ఆక్రమణల నుంచి కాపాడతామని ఎన్నికలకు ముందు సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చింది. రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తులను ఆక్రమించిన వారిపై వక్ఫ్ బోర్డు కొరడా ఝళిపిస్తోంది. ఆస్తులను ఆక్రమణల చెర నుంచి విడిపించి స్వాధీనం చేసుకునే ప్రక్రియ వేగంగా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సర్వే ద్వారా ఆక్రమణలో ఉన్న వక్ఫ్ ఆస్తులను గుర్తిస్తున్నారు. తొలి దశలో కొన్ని ఆస్తులు గుర్తించగా, రెండో దశ సర్వే వేగంగా సాగుతోంది. ఈ సర్వే ద్వారా అన్యాక్రాంతమైనట్టు గుర్తించిన ఆస్తులను వక్ఫ్ బోర్డు పరిధిలోని టాస్‌్కఫోర్స్ విభాగం స్వాదీనం చేసుకుంటోంది. వక్ఫ్ బోర్డు ప్రత్యేక అధికారి షేక్ షిరీన్ బేగం పర్యవేక్షణలో అధికారులు, మైనారిటీ సంక్షేమ శాఖ, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. గత 15 రోజులుగా రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు తీసుకున్న కొన్ని ప్రధాన చర్యలు.. ♦ నంద్యాల పట్టణంలోని నూనెపల్లి – రైతు నగరం ప్రాంతాల మధ్య వక్ఫ్ భూముల్లో వ్యాపార సముదాయాలు నిరి్మంచిన కొందరు అక్రమార్కులకు చెక్ పెట్టారు. 231 సర్వే నంబర్లో 3.89 ఎకరాలు, 47వ సర్వే నంబర్లో 7.48 ఎకరాలు, 22వ సర్వే నంబర్లో 5.92 ఎకరాలకు నోటీసులు జారీ చేసి ఆక్రమణల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. ♦ అన్నమయ్య జిల్లావ్యాప్తంగా ఉన్న వక్ఫ్ బోర్డు భూములను ప్రత్యేకాధికారి షిరీన్ బేగం బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. గువ్వల చెరువు, రహీంషా వలి దర్గా, రాయచోటి జామియ మసీదు ఆస్తులవాస్తవ పరిస్థితులు, రికార్డులను పరిశీలించింది. ఇవి అన్యాక్రాంతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక సిద్ధం చేసింది. ♦ రాయచోటి దర్గా భూమిని, దుకాణాల్లో ఆక్రమణలు లేవని గుర్తించి అటాచ్ చేశారు. ♦పల్నాడు జిల్లాలో అన్యాక్రాంతమైన వక్ఫ్ భూముల్లో ఆక్రమణలు తొలగించి సంబంధిత శాఖకు అందించాలని ఆ జిల్లా కలెక్టర్ శివశంకర్ ఇటీవల రెవెన్యూ అధికారులను ఆదేశించారు. దీనిపై కార్యాచరణ కోసం వక్ఫ్ భూముల పరిరక్షణ కమిటీ తొలి సమావేశాన్ని నిర్వహించారు. ♦ వినుకొండలో అన్యాక్రాంతమైన మసీదు మాన్యం భూమి స్వా«దీనానికి చర్యలు చేపట్టారు. తిమ్మాయపాలెంలో ఆక్రమణకు గురైన ఆరు ఎకరాలపై కార్యాచరణ సిద్ధం చేశారు. ♦ ఇచ్చాపురం మున్సిపాలిటీలో ఆక్రమణలకు గురైన స్థలాలు, అమ్మకాలు జరిపిన ఆస్తుల రికార్డులు పరిశీలించారు. వక్ఫ్ బోర్డుకు చెందిన మసీదులు, శ్మశాన వాటికలు పరిశీలించారు. ఇచ్చాపురం హాస్పిటల్ రోడ్డులో వక్ఫ్ ఆస్తుల ఆక్రమణలను గత నెల 21న తొలగించారు. వక్ఫ్ స్థలంలో వివాదాస్పదంగా మారిన కంటైనర్‌ను తొలగించారు. 4.82 ఎకరాల విస్తీర్ణంలో 30 ఏళ్లుగా షాపులు ఆక్రమించుకుని వ్యాపారాలు చేస్తున్న 24 మంది దుకాణదారులను ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. సీఎం ఆదేశాలతో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో వక్ఫ్ భూములు, ఆస్తుల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాం. అన్యాక్రాంతమైన ఆస్తులను స్వా«దీనం చేసుకుంటున్నాం. ప్రభుత్వ శాఖల సహకారంతో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ చర్యలు చేపట్టాం. వక్ఫ్ బోర్డుకు చెందిన గజం భూమిని కూడా వదలం. ఆక్రమణలు ఖాళీ చేయకపోతే చట్టప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. – షేక్ షిరీన్‌బేగం, వక్ఫ్‌బోర్డు ప్రత్యేకాధికారి -
TS: 48 ఎకరాల భూములపై కన్నేసి.. 24 ఎకరాలు మింగేసి..
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: భూ సమస్యలకు సంబంధించి ఎలాంటి అవకతవకలు, జాప్యానికి తావు లేకుండా.. పారదర్శకంగా పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. అయితే అధికారుల అండతో దీనికీ తూట్లు పొడుస్తున్న అక్రమార్కులు.. వివాదాల్లో ఉన్న వక్ఫ్ భూముల్ని మింగేస్తున్నారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలం ముక్తిపాడ్ గ్రామ పంచాయతీ పరిధిలో చోటుచేసుకున్న భూ బాగోతం ఇందుకు ఓ ఉదాహరణగా నిలుస్తోంది. కోర్టులో కేసులుండి వివాదాస్పదంగా మారిన వక్ఫ్ బోర్డుకు చెందిన ఇనాం (కిద్మత్) భూములపై ఎప్పటినుంచో నజర్ వేసిన కొందరు ‘పెద్దలు’చాకచక్యంగా వాటిని కొట్టేశారు. టెనెంట్‌దారులు (సాగుదారులు), ఇనాందారుల మధ్య రాజీ కుదర్చడంతో పాటు నకిలీ దస్తావేజులు సృష్టించి, రిజి్రస్టేషన్ చేయించి కోట్లాది రూపాయలు దండుకున్నారు. నిబంధనల ప్రకారం వక్ఫ్ బోర్డు పరిధిలో కిద్మత్ ఇనాం కింద ఇచి్చన భూముల క్రయవిక్రయాలకు హక్కులు ఉండవు. ఎవరైతే ఇనాం పొందుతారో వారితో పాటు తర్వాతి తరాలు సాగు చేసుకునేందుకు మాత్రమే హక్కులు ఉంటాయి. కానీ.. కొంతకాలం క్రితం బదిలీపై వెళ్లిన ఓ జిల్లా స్థాయి అధికారి, ఓ నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధి కుమ్మక్కై చక్రం తిప్పారనే ఆరోపణలున్నాయి. రిజిస్ట్రేషన్ కోసం రూ.5 కోట్లతో ఒప్పందం చేసుకున్నారని, తహసీల్దార్‌కు సమాచారం లేకుండానే రిజి్రస్టేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి రావడం సంచలనం సృష్టిస్తోంది. వారసులతో ఒప్పందం కుదుర్చుకుని.. ముక్తిపాడ్ గ్రామ పంచాయతీ పరిధిలో 19, 20, 50, 51 సర్వే నంబర్లలో 48 ఎకరాల భూమి ఉంది. దీన్ని మూడు తరాలుగా చెన్నారం గ్రామానికి చెందిన కొన్ని కుటుంబాల వారు సాగు చేసుకుంటూ టెనెంట్దారులుగా ఉన్నారు. రెవెన్యూ రికార్డుల్లో ఇది కిద్మత్ కింద ఇనాం భూమిగా.. హుస్సేని ఆలం ఇనాందారుగా ఉన్నారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచి్చన తర్వాత ఆలం ఆ భూముల పట్టాదారుగా ఆన్లై¯న్లో నమోదైంది. విషయం తెలిసిన టెనెంట్ దారులు తాము అనేక ఏళ్లుగా ఈ భూమిని సాగు చేసుకుంటున్నామని, తమ పేరు మీద పట్టాదారు పాసు బుక్కులు ఇవ్వాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత సదరు ఇనాందారుకు చెందిన వారసులు (మూడో తరం) కూడా తమకే హక్కు కలి్పంచాలంటూ కోర్టు మెట్లు ఎక్కారు. ఇలా ఇరువర్గాల మధ్య వివాదం కొనసాగుతుండగా ఈ భూములపై కన్నేసిన పెద్దలు.. ఇనాందారుడి వారసులతో ముందస్తు ఒప్పందం చేసుకున్నారు. మీ పేరిట పట్టాదారు పాసుబుక్కులు తెచ్చే బాధ్యత తమదని..ఆ తర్వాత ఆ భూమిని తమకే అమ్మాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు ఇనాందారుడి వారసులను కుటుంబసభ్యులుగా చేర్చి ఫ్యామిలీ సరి్టఫికెట్‌తో సంబంధిత 48 ఎకరాల కిద్మత్ ఇనాం భూమిని అధికారుల అండదండలతోవారి పేరిట మార్చి పట్టాదారు పాసు పుస్తకాలు అందజేశారు. ఇలా వెలుగులోకి.. ఇనాందారుల పేరిట మొత్తం 48 ఎకరాలకు పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరైన విషయం తెలుసుకున్న టెనెంట్ దారులు మూకుమ్మడిగా కోస్గిలోని తహసీల్దారు కార్యాలయానికి చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగడంతో అసలు విషయం వెలుగులోకి వచి్చంది. అయితే తన ప్రమేయం లేకుండానే పాసు బుక్కులు వచ్చాయని.. తనకు కనీస సమాచారం లేదని తహసీల్దార్ లిఖిత పూర్వకంగా ధ్రువీకరణ ఇచ్చారు. అసలు విషయం బట్టబయలు కావడంతో పాసు బుక్కులు రద్దు చేస్తున్నామని జిల్లా అధికారులు ప్రకటించి తాత్కాలికంగా గొడవను సద్దుమణిగించారు. కానీ అక్రమార్కులు ఇంతటితో ఆగలేదు. భూముల్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని పథకం వేశారు. ఓ అధికారి కీలకపాత్ర! నారాయణపేట జిల్లా కలెక్టరేట్లో పనిచేస్తున్న ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన ఓ అధికారి ఈ భూ బాగోతంలో కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. జిల్లా స్థాయి అధికారితో పాటు ఓ నియోజకవర్గ ప్రజాప్రతినిధికి సమాచారం చేరవేసి తతంగం నడిపించినట్లు సమాచారం. కోర్టు కేసులకు సంబంధించి ఇరువర్గాల అడ్వకేట్లు సహా ఇటు టెనెంట్‌దారులు, అటు వారసుల మధ్య రాజీ కుదిర్చాడు. ఇరువర్గాలు 48 ఎకరాల భూములను సమానంగా పంచుకుని.. హైదారాబాద్ చెందిన ఓ రియల్టర్ల గ్రూప్‌నకు అమ్మేలా ఒప్పందం చేయించాడు. ఉన్నతాధికారి సహకారంతో ఇరువర్గాలకు (టెనెంట్, ఇనాందారులకు) సమానంగా 24 ఎకరాల చొప్పున రిజి్రస్టేషన్ చేయించాడు. గుట్టుచప్పుడు కాకుండా సాగిన రిజి్రస్టేష¯న్ వెనుక రూ.5 కోట్ల డీల్ ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ రియల్టర్లు ప్రజాప్రతినిధి బినామీలేనట.. ఒప్పందం ప్రకారం ఇనాందారులకు సంబంధించిన 24 ఎకరాల భూములను హైదరాబాద్‌కు చెందిన రియల్టర్ల పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు. అయితే వీరందరూ నియోజకవర్గ ప్రజాప్రతినిధికి చెందిన బినామీలేనని తెలిసింది. కాగా సదరు ప్రజాప్రతినిధి ముందస్తు ఒప్పందం ప్రకారం వారసులకు తూతూ మంత్రంగా ముట్టజెప్పినట్లు తెలిసింది. ఆ తర్వాత ఇటీవలే 11 ఎకరాలను కోస్గి పట్టణానికి చెందిన ఇద్దరు బడావ్యాపార వేత్తలకు ఏకంగా రూ.6.5 కోట్లకు విక్రయించి తిరిగి వారి పేరిట రిజి్రస్టేషన్ చేయించారు. ఈ భూభాగోతంపై వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ రియాజ్‌ను సంప్రదించగా.. ‘నేను ఇటీవలే బదిలీపై వచ్చా. పూర్తి స్థాయిలో సమాచారం సేకరించి వక్ఫ్ బోర్డు సీఈఓకు నివేదిక అందజేస్తా’అని సమాధానమిచ్చారు. ఇది కూడా చదవండి: మూడు రాష్ట్రాల సరిహద్దులో ‘మావో’ల భేటీ? -
మూడొంతులు గల్లంతు!
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కొంగర కుర్దులో సయ్యద్ శారాజ్ ఖత్తాల్ హుస్సేన్ దర్గాకు సుమారు 500 ఎకరాల భూమి ఉంది. చాలావరకు భూమి సాగులో ఉంది. 2008లో వక్ఫ్‌బోర్డు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో కొందరు రైతులు కోర్టును ఆశ్రయించి స్టే పొందారు. ఇలావుండగా సర్వే నంబర్ 82/అ/1/1లోని ఆరు ఎకరాలకు సంబంధించి ఒక రైతు పేరిట 2018లో పట్టాదారు పాస్‌బుక్ జారీ అయింది. తర్వాత తప్పిదాన్ని గుర్తించిన రెవెన్యూ అధికారులు 2021లో పాస్‌బుక్‌ను రద్దు చేశారు. అయితే అప్పటికే సదరు రైతు నుంచి భూమిని కొనుగోలు చేసిన రియల్టర్లు రిజిస్ట్రేషన్ కు ప్రయత్నించగా నిషేధిత జాబితా కారణంగా ప్రక్రియ నిలిచిపోయింది. మరోవైపు హెచ్ఎండీఏఅధికారులు అవగాహన రాహిత్యంతో భూమికి లే అవుట్ పర్మిషన్స్ (ఎల్పీ) నంబర్ జారీ చేయడంతో, ఫైనల్ లే అవుట్ అప్రూవల్ కోసం సదరు రియల్టర్లు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వక్ఫ్ భూములు యథేచ్చగా ఆక్రమణలకు గురవుతున్నాయి. ఇప్పటికే వేలాది ఎకరాలు కబ్జాలో ఉన్నాయి. వక్ఫ్‌బోర్డు సిబ్బందే స్థిరాస్తి వ్యాపా రులతో కుమ్మక్కై రికార్డులు తారు మారు చేస్తున్నారనే ఆరోపణలు ఉండగా, ప్రభుత్వం కూడా వీటిని రెవెన్యూ భూములుగా పేర్కొంటూ అడ్డగోలుగా ధారాదత్తం చేస్తోందనే విమర్శలున్నాయి. మరోవైపు లీజులకు ఇచ్చిన భూములు సైతం క్రమంగా చేజారిపోతున్నాయి. నిజాం కాలం నుంచి వక్ఫ్ ఆస్తుల రికార్డులు ఉర్దూ, పార్సీ భాషల్లో ఉండగా, భద్రపరచాల్సిన వారే చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. రిటైరైన పర్మినెంట్ సిబ్బంది స్థానంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తుండటం అక్రమార్కులకు కలిసి వస్తోంది. నామమాత్రపు చర్యలే.. వక్ఫ్‌బోర్డు రికార్డుల ప్రకారం రాష్ట్రంలోని దర్గాలు, మసీదులు, ఆషూర్ ఖానాలు, చిల్లాలతో పాటు స్మశానవాటికలు తదితరాల (మొత్తం 33,929) కింద సుమారు 77,588.07 ఎకరాల భూమి ఉంది. అందులో మూడొంతులు అంటే.. ఏకంగా 57,423.91 ఎకరాలు (74 శాతం) ఆక్రమణలో ఉండటం విస్మయం కలిగించే అంశం. ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో అధిక శాతం భూములు కబ్జాకు గురైనట్లు తెలుస్తోంది. మెదక్‌లో దాదాపు పూర్తిగా పరాధీనమయ్యాయి. బోర్డు సుమారు 2,186 మంది ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసినా తదుపరి చర్యలు ముందుకు సాగలేదు. ఇటీవల హైకోర్టు ఆదేశాలతో కబ్జాలపై ఉక్కుపాదం కోసం రెవెన్యూ, పోలీసు, వక్ఫ్ బోర్డు అధికారులతో కూడిన ఒక టాస్‌్కఫోర్స్ ఏర్పాటైనా చలనం మాత్రం లేదు. మరోవైపు రాష్ట్ర వక్ఫ్ బోర్డులోని రికార్డుల గదికి ఐదేళ్లుగా తాళం చిప్ప వేలాడుతోంది. అవినీతి ఆరోపణలు దష్ట్యా సీఎం ఆదేశాలతో రెవెన్యూ అధికారులు కీలక రికార్డులను స్వా«దీనం చేసుకొని రికార్డు రూమ్‌ను సీజ్ చేశారు. అది ఇప్పటివరకు తెరుచుకోక పోవడంతో సుమారు 3,400 ఎకరాల భూమికి సంబంధించిన కోర్టు కేసులు సరైన ఆధారాలు లేక వీగిపోయాయి. కబ్జాల పర్వం.. ♦ నల్లగొండ జిల్లా దేవరకొండలో 111 ఎకరాల 8 గుంటల వక్ఫ్ భూమిలో సుమారు 83 ఎకరాలు కబ్జా కోరల్లో చిక్కుకుంది. ♦ మల్కాజిగిరిలో హజరత్ మీర్ మెహమూద్ సాహబ్ పహాడి దర్గాకు సర్వే నంబర్ 659, 660లో సుమారు మూడు ఎకరాల వక్ఫ్ భూమి ఉంది. తాజాగా ఒక వ్యక్తి ఈ భూమిపై తిష్ట వేశాడు. ఫెన్సింగ్ వేసి ప్లాటింగ్‌కు సిద్ధమవుతున్నాడు. ♦ చిల్లా కోహ్–ఎ–మౌలా–అలీకి మల్లాపూర్, కీసర రాంపల్లిలో సుమారు 232 ఎకరాల భూమి ఉండగా సగానికి పైగా భూబకాసురుల ఆక్రమణలో ఉంది. ♦ మణికొండ దర్గాకు 1,654 ఎకరాల భూమి ఉన్నట్టు రికార్డులుండగా ప్రస్తుతం ఎకరం భూమి కూడా కన్పించడం లేదు. ♦ హకీముల్ మునవీ అల్ మారూఫ్ హకీం బాబా దర్గాకు కుతుబ్‌షాహీల కాలంలో దర్గా నిర్మాణం కోసం 4,448 గజాలు, దర్గా నిర్వహణ కోసం 323 ఎకరాల 18 గుంటల భూమిని వక్ఫ్ చేయగా, ప్రస్తుతం దర్గా మినహా మిగతా భూమి ఉనికి లేకుండా పోయింది. ధారాదత్తం ఇలా.. ♦ ఐదో నిజాం రాజు అఫ్జల్ దౌలా మణికొండ గ్రామ పరిధిలో హుస్సే¯న్ షావలి దర్గాకు 1,898 ఎకరాలు రాసిచ్చారు. 1959లో గెజిట్ కూడా విడుదల అయ్యింది. అయితే రికార్డుల్లో సర్కారీ పేరుతో ఉన్న వక్ఫ్ భూముల్ని రెవెన్యూగా పేర్కొంటూ ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టింది. ♦ పహడీషరీఫ్‌లో బాబా షర్ఫొద్దీన్ దర్గాకు మామిడిపల్లిలో 2,131 ఎకరాల భూమి ఉండగా, దీంట్లోంచి 1,051 ఎకరాల భూమిని వక్ఫ్‌బోర్డు అనుమతి లేకుండానే ప్రభుత్వం విమానాశ్రయానికి, మరో 91 ఎకరాల భూమిని ఏపీఐఐసీకి అప్పగించింది. ♦ సూర్యాపేట జిల్లా మోతె మండలం మామిళ్లగూడెంలో ఈద్గాకు చెందిన సర్వే నంబర్ 290లోని 9.20 ఎకరాల భూమిని ప్రభుత్వం రోడ్డు విస్తరణలో భాగంగా ప్రభుత్వం జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ)కు అప్పగించింది. న్యాయాధికారాలు ఉండాలి వక్ఫ్ బోర్డుకు ప్రత్యేక న్యాయాధికారాలు ఉండాలి. వక్ఫ్, రెవెన్యూ భూములపై స్పష్టత రావాలి. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది స్థానంలో శాశ్వత ఉద్యోగులను నియమించాలి. రికార్డులు గల్లంతు కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. అక్రమణలను తొలగించేందుకు పోలీసు, రెవెన్యూ యంత్రాంగం సహకరించాలి. – అబుల్ పత్హే బందగి బద్షా రియాజ్ ఖాద్రీ, పాలక మండలి సభ్యుడు, వక్ఫ్‌బోర్డు. హైదరాబాద్ రికార్డుల గదిని తక్షణమే తెరిపించాలి వక్ఫ్ భూముల రికార్డుల గదిని తక్షణమే తెరిపించాలి. కోర్టు వివాదాల్లోని భూములపై సమగ్ర ఆధారాలు సమర్పించే విధంగా చర్యలు అవసరం. అప్పుడే వక్ఫ్ భూముల పరిరక్షణ సాధ్యమవుతుంది. ప్రభుత్వం దీనిని సీరియస్‌గా తీసుకోవాలి. – సయ్యద్ ఇఫ్తేకర్ హుస్సేనీ, వక్ఫ్ భూముల పరిరక్షణ కమిటీ గద్వాలలోని హజరత్ సయ్యద్ షా మరూఫ్ పీర్ ఖాద్రీ దర్గాకు 39.8 ఎకరాల భూమి ఉంది. సంగాలలోని సర్వే నంబర్ 95, 96, 97, 98లోని 27.9 ఎకరాల భూమిని దర్గా ముతవల్లి ద్వారా స్థానిక రైతు ఒకరు సాగు కోసం లీజుపై తీసుకున్నారు. తర్వాత ఆ రైతు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడటంతో అతని సోదరుడు రెవెన్యూ శాఖ ద్వారా యాజమాన్య హక్కు సర్టిఫికెట్ (ఓఆర్సీ) పొందాడు. తర్వాత తన పేరిట మారి్పడి చేసుకొని ప్లాటింగ్‌కు ప్రయత్నించాడు. దర్గాకు చెందినవారి ఫిర్యాదుతో జాయింట్ కలెక్టర్ కోర్టు ఓఆర్సీపై స్టే ఇవ్వగా దానిపై హైకోర్టు స్టే విధించింది. -
వివాదాస్పద 6 ఎకరాల స్థలానికి హెచ్ఎండీఏ ఎల్పీ.. ఇదో అంతుచిక్కని ప్రశ్న!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వ నిషేధిత జాబితాలో ఉన్న వక్ఫ్ భూమికి ఏకంగా హెచ్ఎండీఏ లే అవుట్ పర్మిషన్ (ఎల్పీ) ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వం రూపొందించిన ధరణి, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్లు నిషేధిత జాబితాలో పొందుపర్చిన ఈ భూముల వివరాలను కనీసం పరిశీలించకుండా ఏకపక్షంగా అనుమతులు జారీ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులే ఇలా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాస్‌బుక్‌ను రద్దు చేసినా.. మహేశ్వరం మండలం కొంగరకుర్దు రెవెన్యూ పరిధిలోని ఔటర్‌ను ఆనుకుని సుమారు 500 ఎకరాల వక్ఫ్ భూమి ఉంది. 1962 నుంచి ఇప్పటి వరకు పహానీల్లో పట్టాదారు కాలంలో సయ్యద్ శారాజ్ ఖత్తాల్ హుస్సేన్‌సాబ్ దర్గా పేరిట నమోదైంది. దీన్ని వక్ఫ్ భూమిగా పేర్కొంటూ 2008లో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ భూమిని సాగు చేసుకుంటున్న కొందరు రైతులు గెజిట్‌ను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు స్టేటస్ కో విధించింది. అప్పటి నుంచి కేసు పెండింగ్‌లోనే ఉంది. అనంతరం వక్ఫ్‌భూముల రిజిస్టేషన్లు సైతం నిలిచిపోయాయి.కానీ సర్వే నంబర్ 82/అ/1/1లో 11.17 ఎకరాలు ఉండగా, ఇందులో ఆరు ఎకరాలకు 2018లో ఒకరి పేరిట (ఖాతా నంబర్ 429 టీ 0516090202) పట్టాదారు పాస్‌బుక్ జారీ చేయడం.. ఒకే భూమికి రెండుసార్లు ఓఆర్సీ ఇవ్వడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటంతో పాటు రిజిస్ట్రేషన్లు నిషేధం ఉన్న సమయంలో కొత్త పట్టాదారు పాస్‌బుక్ ఎలా ఇచ్చారని స్థాని కులు రెవెన్యూ అధికారులను నిలదీశారు. రికార్డుల్లో పొరపాటున పట్టాదారుగా నమోదైందని పేర్కొంటూ, సదరు పాసుపుస్తకాన్ని రద్దు చేస్తూ 2021 జనవరి 5న ఎండార్స్మెంట్ జారీ చేశారు. వివాదాస్పదమని తేలినా.. పట్టాదారు పాస్‌బుక్‌ను ప్రభుత్వం రద్దు చేసినప్పటికీ సదరు వ్యక్తి నుంచి ఈ భూమిని నగరానికి చెందిన ఇద్దరు రియల్టర్లు కొనుగోలు చేశారు. ఈ మేరకు 20 ఏప్రిల్ 2021న మహేశ్వరం రిజిస్ట్రేషన్ ఆఫీసులో డాక్యుమెంట్ రిజిస్ట్రర్ చేయించేందుకు యత్నించగా ఇది నిషేధిత జాబితాలో ఉన్న వివాదాస్పద స్థలమని తేలింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను పెండింగ్‌లో పెడుతూ ఇదే అంశాన్ని సంబంధిత డాక్యుమెంట్‌పై కూడా రాసి పెట్టారు. ఇటు ధరణి, అటు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ వెబ్సైట్లలో నిషేధిత జాబితాలో ఉన్న ఈ భూమికి హెచ్ఎండీఏ అధికారులు తాజాగా ఎల్పీ నంబర్ ఎలా జారీ చేశారనేది అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది. ఫైనల్ లే అవుట్ అప్రూవల్ జారీ చేయాల్సిందిగా సదరు రియల్టర్లు ప్రస్తుతం తుక్కుగూడ మున్సిపల్ అధికారులపై ఒత్తిడి తెస్తుండడం గమనార్హం. చాలాసార్లు ఫిర్యాదు చేశాం వక్ఫ్‌బోర్డుకు చెందిన భూమిని అమ్మడం, కొనడం నేరం. కొంతమంది రియల్టర్లు దీన్ని ఆక్రమించి, చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేసి ప్లాట్లు చేసి అమ్ముతున్నారు. అధికారులకు చాలాసార్లు ఫిర్యాదు చేశాం. కోర్టులో కేసు కూడా నడుస్తోంది. హెచ్ఎండీఏ అధికారులు లేఅవుట్ పర్మిషన్ ఎలా ఇచ్చారో అర్థం కావడం లేదు. తప్పుడు రికార్డులు సృష్టించి, అధికారులను తప్పుదోవ పట్టించి భూమిని అమ్మేందుకు యత్నిస్తున్న వారిపై.. రికార్డులు పరిశీలించకుండా అనుమతులు జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. – ఎ.శ్రీనివాస్‌గౌడ్, రావిర్యాల అది ముమ్మాటికీ వక్ఫ్ భూమే.. కొంగరకుర్దు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 82లోని భూమి వక్ఫ్‌బోర్డుకు చెందినదే. కొంతమంది రియల్టర్లు ఇటీవల ఆ భూమిని చదును చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. వెంటనే సిబ్బందిని అక్కడికి పంపి పనులు నిలుపుదల చేయించాం. భూమికి సంబంధించిన డాక్యు మెంట్లు ఉంటే చూపించాలని కోరాం. ఇప్పటి వరకు రాలేదు. ఈ భూమికి హెచ్ఎండీఏ ఎల్పీ నంబర్ జారీ చేసిన విషయం తెలియదు. నిషేధిత జాబితాలో ఉన్న భూమికి ఎల్పీ నంబర్ ఎలా ఇచ్చారనేదీ అర్థం కావడం లేదు. – జ్యోతి, తహసీల్దార్, మహేశ్వరం -
వక్ఫ్ భూములు ఉఫ్..తొలుత లీజుకు ఇచ్చి.. ఆపై కబ్జా
వితరణ శీలురైన కొందరు ముస్లిం సంపన్నులు తమ స్థిరాస్థిలో కొంత భాగాన్ని, లేదా మొత్తం ఆస్తిని ‘అల్లా’ పేరున రాశారు. ఈ ప్రక్రియను ఇస్లాం సంప్రదాయంలో వక్ఫ్ చేయడం అంటారు. ఒకసారి వక్ఫ్ చేసిన ఆస్తిని తిరిగి తీసుకోవడం కుదరదు. అమ్మడమూ కుదరదు. దాత సంతతికి చెందిన వారికి కూడా దాని మీద ఎలాంటి హక్కులు వుండవు. ఇలాంటి భూముల్ని గత సర్కారు పెద్దలు అయిన వారికి యథేచ్ఛగా కట్టబెట్టేశారు. సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ గ్రామంలో ఆసూర్ ఖానాకు చెందిన రెవెన్యూ సర్వే నంబరు 287–1లో 11.34 ఎకరాలు, సర్వే నంబరు 287–5లో 2.6 ఎకరాలు.. మొత్తం 13.94 ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది. ఈ భూమి విలువ రూ.130 కోట్ల పైమాటే. ఈ అక్రమాన్ని అధికారికంగా సక్రమం చేయాలని గత టీడీపీ పెద్దలు ప్రయత్నించారు. కృష్ణా జిల్లా నిడమానూరులో సర్వే నంబర్ 201, 202, 203లో ఖాజీ (ముస్లింల వివాహాలు చేసే గురువు) సర్వీసు కోసం కేటాయించిన మాన్యం భూమి 39.16 ఎకరాలు టీడీపీ దన్నుతో ఏడుగురు బినామీలు చేజిక్కించుకున్నారు. విజయవాడ భవానీపురంలో కోట్లాది రూపాయల విలువైన దర్గా మాన్యం 40 ఎకరాల భూమిని మార్బుల్ స్టోన్ వ్యాపారులకు నామమాత్రపు లీజుకు ఇచ్చేశారు. కొండపల్లి శాంతినగర్ సర్వే నంబర్ 212ఎ, 212బిలో 18.30 ఎకరాలు, 293/1లో 18 సెంట్లు, ఇబ్రహీంపట్నంలో సర్వే నంబర్ 240లో 26 ఎకరాల ఖాజీ మాన్యం ఆక్రమణల పాలైంది. ఆ భూముల్లో భారీ భవంతులు నిర్మించారు. ఇలా వెయ్యి కాదు.. పది వేలు కాదు.. ఏకంగా 31,584 ఎకరాల వక్ఫ్ (ధార్మిక దానం ఇచ్చినవి) భూములు అక్రమార్కుల వశమయ్యాయి. దీంతో దాతల లక్ష్యం, ఔదార్యం నీరుగారిపోతోంది. అనంతపురం, కర్నూలు, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ అక్రమాలు చోటుచేసుకున్నాయి. బాబు జమానాలో అక్రమాలకు ఊతం ► చంద్రబాబు పాలించిన రోజుల్లో వక్ఫ్ భూముల్లో అక్రమాలకు ఊతమిచ్చారని ముస్లిం సమాజం ఆవేదన చెందుతోంది. విశాఖపట్నంలో హజ్రత్ ఇషాక్ రహనతుల్లాలై దర్గాకు చెందిన 3,500 ఎకరాల భూమి కార్పొరేట్ సంస్థలకు పంచిపెట్టింది చంద్రబాబే. ► వక్ఫ్ భూముల అన్యాక్రాంతానికి గత ప్రభుత్వం అధికారిక ముద్ర వేసేందుకు గట్టి ప్రయత్నాలు చేయడంతో న్యాయపరమైన వివాదాలు రేగాయి. నిరర్థక ఆస్తుల పేరుతో టీడీపీ అనుయాయులకు, బడాబాబులకు, కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం చేశారు. ► కాజా భూముల వ్యవహారం ఈ కోవలోకే వస్తుంది. 2018 నవంబర్ 13న అప్పటి వక్ఫ్ బోర్డు చైర్మన్, ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు సమావేశంలో వారికి అనుకూల నిర్ణయం తీసుకున్నారు. ఆ భూమిని నిరర్థక ఆస్తిగా చూపిస్తూ తీర్మానం చేశారు. ► రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాల వక్ఫ్ భూములను ఆక్రమణల చెర నుంచి విడిపించడం మానేసి, అన్యాక్రాంతం పేరుతో అయినకాడికి తెగనమ్మి సొంత మనుషులకు ప్రయోజనం చేకూర్చే ప్రయత్నాలు జరిగాయి. గత ప్రభుత్వ పెద్దలు ఆడిన ఆటలో పావులుగా మారిన ముగ్గురు సీఈవోలు కేవలం మూడు నెలల వ్యవధిలోనే బదిలీ వేటుకు గురయ్యారు. ► కాజా భూముల వ్యవహారంలో ఫైల్ నంబర్ ఎస్ /19/జిఎన్టీ/2018 లేఖ ద్వారా 2017 డిసెంబర్ 3న సచివాలయానికి అనుకూల తీర్మానం చేసి పంపగానే సీఈవో ఎండీ సుభానీని 2018 జనవరిలో అక్కడి నుండి బదిలీ చేశారు. మరో సీఈవోను నియమించుకుని అనుకూల పనులు చేయించుకున్న గత ప్రభుత్వం మళ్లీ ఆయన్ను కూడా బదిలీ చేసింది. 2018 ఫిబ్రవరిలో షేక్ అహ్మద్‌ను కొత్త సీఈవోగా నియమించారు. వాటికే వక్ఫ్ ఆస్తుల వినియోగం ► స్థిరాస్తుల్ని పరిరక్షిస్తూ ఇస్లామిక్ ధార్మిక కార్యక్రమాలకు, ముస్లిం సమాజంలోని నిరుపేదల సంక్షేమానికి ఆ భూములను వినియోగించాలనేది వక్ఫ్ లక్ష్యం. మసీదు, ఆషూర్ ఖానా, దర్గా, ముషాఫిర్ ఖానా, ఖాజీ, అంజుమన్, మొహర్రం నిర్వహణ వ్యయం కోసం ఈ భూములు ఉపయోగపడాలన్నది దాతల మహోన్నత ఆశయం. ► ఈ రకంగా మన దేశంలో దాదాపు 3 లక్షల ముస్లిం ధార్మిక సంస్థలు తమ ఆస్తులను వక్ఫ్ బోర్డు కింద రిజిస్టర్ చేసుకున్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల కంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక సంస్థలు వక్ప్ బోర్డు కింద రిజిష్టర్ చేయడం విశేషం. చట్టాన్ని ఆసరా చేసుకుని అక్రమాలు ► వాస్తవానికి వక్ఫ్ చట్టం–1995 (సెంట్రల్ యాక్ట్) ప్రకారం వక్ఫ్ ఆస్తుల క్రయ విక్రయాలు, అన్యాక్రాంతం, అసలు లక్ష్యానికి తూట్లు పొడిచేలా వినియోగం కుదరదు. కానీ అదే చట్టంలోని సెక్షన్–97ను ఆసరాగా తీసుకుని గత ప్రభుత్వం అనేక ప్రాంతాల్లోని వాటిని నిరర్థక ఆస్తులుగా చూపి చేతులు మారేలా వెసులుబాటు కల్పించడంతో న్యాయ వివాదాలు రేగాయి. ► వక్ఫ్ ఆస్తుల అన్యాక్రాంతం తగదని సుప్రీంకోర్టుతో పాటు హైకోర్టు సైతం అనేక తీర్పులు చెప్పినప్పటికీ ఆ ఆస్తులను కాపాడేందుకు గత ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోలేదు. రానురాను ముస్లిం సమాజపు నిస్సహాయత, గతంలో వక్ఫ్ బోర్డు బాధ్యుల అవినీతి తదితర కారణాలతో వేలాది ఎకరాల వక్ఫ్ భూములు అన్యాక్రాంతమయ్యాయి. కాజా వక్ఫ్ భూముల అన్యాక్రాంతంపై 2018లో రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్ సెక్రటరీకి అప్పటి వక్ఫ్ సీఈవో ఇచ్చిన నివేదిక ముందు లీజు.. ఆపై కైంకర్యం.. ► దాతలు ఇచ్చిన విలువైన భూములను ధర్మకర్తల(ముతవల్లీ)కు, ఖాజాలు తదితర ముస్లిం సమాజానికి చెందిన వారి బతుకుదెరువు కోసం కేవలం 11 నెలల లీజుకు ఇస్తారు. అయితే అక్రమార్కులు వక్ఫ్ బోర్డులో ఉన్న వెసులుబాటును సాకుగా తీసుకుని మూడేళ్లపాటు లీజు ఒప్పందాన్ని పొడిగించుకుంటున్నారు. ► తొలుత ముస్లింలతోనే ఆక్రమణ చేయించి, ఆపై బయటి వ్యక్తుల చేతిలోకి ఆ ఆస్తి వెళ్లేలా చక్రం తిప్పారు. ఇంకో విధంగా.. లీజు పేరుతో ముందుగా విలువైన భూములను ఆక్రమించి ఆపై కైంకర్యం చేసేసుకున్నారు. ► ఎవరైనా ఆ స్థలాన్ని ఖాళీ చేయించాలని ప్రయత్నిస్తే చట్టంలో ఉన్న అవకాశాలను అనుకూలంగా మలుచుకుని న్యాయ పరమైన వివాదాలు సృష్టిస్తూ ఏళ్ల తరబడి ఆస్తులను అనుభవిస్తున్నారు. కృష్ణా జిల్లా నిడమానూరులో వక్ఫ్ భూముల అన్యాక్రాంతంపై 2019లో అప్పటి కలెక్టర్ ఇంతియాజ్ వక్ఫ్ సీఈవోకు ఇచ్చిన నివేదిక వక్ఫ్ ఆస్తుల రక్షణకు చర్యలు ఆంధ్రప్రదేశ్‌లో ముస్లిం మైనార్టీలకు మేలు చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో 502 వక్ఫ్ సంస్థలకు చెందిన 65,783 ఎకరాల్లో గతంలో 31,584 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. ఈ భూములను కాపాడేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాం. వక్ఫ్ బోర్డుల పరి«ధిలోని ఆస్తుల రక్షణకు, ముస్లింలకు కొత్త శ్మశానాల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. వక్ఫ్ ఆస్తుల వివాదాలపై తక్షణ చర్యలు తీసుకునేలా ఏపీలో త్వరలో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటు కోసం సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. – అంజాద్ బాషా, ఉప ముఖ్యమంత్రి ముస్లిం దాతల స్ఫూర్తి నిలపాలి ముస్లిం సమాజం కోసం విలువైన భూములను త్యాగం చేసిన దాతల స్ఫూర్తిని నిలిపేలా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. వక్ఫ్ ఆస్తుల పరరిక్షణ కోసం లీజు ప్రక్రియను పూర్తిగా ప్రక్షాళన చేయాలి. వీటిపై క్షేత్ర స్థాయిలో సర్వే చేసి, అన్యాక్రాంతమైన వాటిని పరక్షించేందుకు గట్టి చర్యలు తీసుకోవాలి. అక్రమార్కుల చెర నుంచి వాటిని కాపాడాలి. ముస్లిం సమాజానికి ఆ ఆస్తులు ఉపయోగపడేలా చట్టపరమైన చర్యలు త్వరగా తీసుకోవాలి. – మునీర్ అహ్మద్, ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వీనర్ -
కర్నూలులో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు సీఎం జగన్ ఆదేశం
-
తుది నోటిఫికేషన్ ఉంటేనే..
సాక్షి, హైదరాబాద్: వక్ఫ్ భూముల లెక్క పక్కా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటివరకు అడ్డదిడ్డంగా ఉన్న వక్ఫ్ రికార్డులను సరిచేయడంతో పాటు భూ రికార్డుల ప్రక్షాళనలో వాటిని పకడ్బందీగా నమోదు చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు ఉత్తర్వులు అం దాయి. ఈ మేరకు వక్ఫ్ బోర్డు పక్షాళన తుది నోటిఫికేషన్ ఉన్న భూములనే వక్ఫ్ భూము లుగా నమోదు చేస్తున్నారు. ప్రాథమిక నోటి ఫికేషన్ అనంతరం ముసాయిదాలో ఉండి తుది నోటిఫికేషన్ ద్వారా గెజిట్‌లో పబ్లిష్ అయిన భూముల వివరాలను మాత్రమే వక్ఫ్ కోటాలో ఉంచుతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్ భూములు 25–30 వేల ఎకరాల వరకు తేలే అవకాశం ఉందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. కుదరని పొంతన వాస్తవానికి, వక్ఫ్ భూముల విషయంలో రెవెన్యూ, వక్ఫ్ అధికారులకు కూడా పొంతన కుదరడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 75 వేలకు పైగా ఎకరాల భూమి తమకుం దని వక్ఫ్‌బోర్డు అధికారులు అంటుంటే.. వక్ఫ్‌భూములు 30 వేల ఎకరాలకు మించ వని రెవెన్యూ శాఖ అంటోంది. వక్ఫ్ ఆస్తుల కింద ఉన్న భూములు రాష్ట్రంలో 75 వేల ఎకరాలు ఉంటాయనే మరో లెక్క కూడా ఉంది. ఇందులో 57వేల ఎకరాలు కబ్జాకు గురవడంతో పాటు ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారని కొన్ని సర్వేల్లో తేలింది. దీని ప్రకారం మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎక్కువగా ఆక్రమణలున్నాయి. మిగిలిన చోట్ల ఆక్రమణ లు న్నా, వక్ఫ్ భూములు కూడా తక్కువే ఉన్నా యి. దీంతో అసలు భూ ప్రక్షాళన అనంతరం వక్ఫ్ భూములు ఎన్ని వేల ఎకరాలు తేలుతుందనే దానిపై ఆసక్తి నెలకొంది. -
టాస్క్‌ఫోర్స్ ఏదీ?
కర్నూలు (రాజ్‌విహార్) : వేలాది ఎకరాల వక్ఫ్ భూములు అన్యాక్రాంతమైనా పట్టించుకునే నాథులే కరువయ్యారు. భూబకాసురుల నుంచి వాటిని స్వాధీన పర్చుకోవాలన్న ఆలోచన కూడా ఎవరికీ రావడం లేదు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ప్రభుత్వం నియమించినప్పటికీ.. అది కాస్తా నిద్రావస్థలో ఉండిపోయింది. టాస్క్‌ఫోర్స్ ఉందన్న విషయం కూడా చాలామందికి తెలియదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉదాసీనత, అధికారుల నిర్లక్ష్యం కారణంగా వక్ఫ్ ఆస్తులు రోజురోజుకూ తరిగిపోతున్నాయి. కలెక్టర్ చైర్మన్‌గా టాస్క్‌ఫోర్స్ కమిటీ వక్ఫ్ ఆస్తుల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేస్తూ 2014 అక్టోబరు 13న జీవో నంబర్ 18 జారీ చేసింది. ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, డీఆర్ఓ/ జిల్లా వక్ఫ్ ఆఫీసర్ కన్వీనర్‌గా ఉన్నారు. అలాగే ఎస్పీ, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓలు, మునిసపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారి, ఆర్అండ్బీ ఈఈ, మైనార్టీ సంక్షేమాధికారి, సర్వే, ల్యాండ్ రికార్డ్స్ ఏడీ, జిల్లా రిజిస్ట్రార్, ఫారెస్టు ఆఫీసర్లను సభ్యులుగా నియమించారు. కమిటీ చేయాల్సిందేమిటంటే.. కలెక్టర్ అధ్యక్షతన ప్రతినెలా సమావేశమై భూముల వివరాలు, ఎవరి ఆక్రమణలో ఉన్నాయి, గతంలో వీరిపై తీసుకున్న చర్యలు, తిరిగి స్వాధీనానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించాలి. వాటిని అభివృద్ధిలోకి తెచ్చేందుకు సలహాలు, ఆదాయ వనరులపై సూచనలు ఇవ్వాలి. భూములపై తీసుకున్న పట్టాదారుపాసు పుస్తకాలు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను రద్దు చేయించాలి. ఇనామ్ అబాలిష్ యాక్ట్ ప్రకారం నేరస్తులపై క్రిమినల్ కేసులు పెట్టి.. ఆ వివరాలను కమిషనర్‌కు తెలపాలి. కబ్జాదారులపై ఐపీసీ, సీఆర్పీసీ వక్ఫ్ యాక్ట్ కింద కేసుల నమోదుకు జిల్లా ఎస్పీ చర్యలు చేపట్టాలి. ఆస్తుల జాబితాను జిల్లా రిజిస్ట్రార్‌కు పంపి పీఓబీలో నమోదు చేయించాలి. ఇతరులకు రిజిష్టర్ కాకుండా చూడాలి. రెవెన్యూ రికార్డుల్లోనూ నమోదు చేయించాలి. ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు కట్టడాలు చేపడితే మునిసిపల్ కమిషనర్లు ఎన్ఓసీలు ఇవ్వరాదు. కమిటీ సమావేశమై తీసుకున్న నిర్ణయాలు, చేపడుతున్న చర్యల వివరాలను ప్రతి నెల మూడున మైనారిటీ శాఖ కమిషనర్‌కు పంపితే.. వాటిని ప్రభుత్వానికి సమర్పిస్తారు. రెండున్నరేళ్లలో రెండే సార్లు.. జీఓ ప్రకారం టాస్క్‌ఫోర్స్ కమిటీ ప్రతి నెలా సమావేశం కావాలి. కానీ ఇప్పటివరకు రెండు సార్లు మాత్రమే సమావేశమైంది. వాటికి కూడా గత కలెక్టర్ హాజరు కాలేదు. దీంతో జేసీ నిర్వహించారు. టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో ఒక్క ఎకరాను కూడా అక్రమార్కుల నుంచి స్వాధీనం చేసుకోలేకపోయారు. మొత్తం 32,599 ఎకరాల్లో 8,100 ఎకరాలు కబ్జాకు గురైనట్లు చెబుతున్నా...వాటి స్వాధీనంపై దృష్టి పెట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. కలెక్టర్ చర్యలు తీసుకోవాలి జిల్లాలో వేలాది ఎకరాల వక్ఫ్ భూములు కబ్జాకు గురయ్యాయి. వీటి స్వాధీనం, మిగిలి ఉన్న ఆస్తుల రక్షణకు చిత్తశుద్ధి అవసరం. ఈ అంశంలో టాస్క్‌ఫోర్స్ ఏమీ చేయలేకపోతోంది. తహసీల్దార్, వీఆర్ఓలతో సమావేశాలు నిర్వహించి వారికీ పరిరక్షణ బాధ్యతలు అప్పగించాలి. కొత్తగా వచ్చిన కలెక్టర్, ఎస్పీలు స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలి. ఎస్. రోషన్ అలీ, రిటైర్డు తహసీల్దారు, సీనియర్ మైనార్టీ నాయకులు ప్రభుత్వం చట్టాన్ని నీరుగార్చింది వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ చట్టాన్ని ప్రభుత్వం నీరుగార్చింది. ఆక్రమించుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా అమ్మిన, కొన్నవారిపై కేసులు పెట్టి శిక్షించాలి. అప్పుడే భయం వస్తుంది. మసీదుల నిర్వహణ కోసం కేటాయించిన భూములను ఆక్రమించుకుని అనుభవించడం అన్యాయం. ఎం.ఖదీరుల్లా, ఇంటలెక్చువల్ కలెక్టివ్స్ సంస్థ జిల్లా అధ్యక్షుడు రెండు సార్లు మాత్రమే నిర్వహించాం టాస్క్‌ఫోర్స్ కమిటీ జీవో ప్రకారం ప్రతి నెలా సమావేశం కావాల్సిన మాట వాస్తవమే. అయితే ఇప్పటి వరకు రెండు సార్లు మాత్రమే సమావేశం జరిగింది. ఇనాయత్, వక్ఫ్‌బోర్డు ఇన్స్పెక్టర్ -
అలజడి..!
► గ్రేటర్లో 13 రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో విచారణ ► బాలానగర్, కూకట్పల్లి కార్యాలయాల్లో భారీ అవకతవకలు ► తేలనున్న అడ్డదారి రిజిస్ట్రేషన్ల లెక్కలు రంగంలోకి విచారణ కమిటీ.. ► పగలనున్న అక్రమాల పుట్ట సాక్షి,సిటీబ్యూరో: అడ్డదారులు, అక్రమ వసూళ్లతో గాడితప్పిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో కొత్త కలకలం మొదలైంది. నగరంలో నిషేధిత భూములు, తక్కువ విలువతో రిజిస్టర్ అయిన అక్రమాల లెక్క తేల్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ రంగంలోకి దిగింది. ఏకంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏడాది కాలంగా జరిగిన రిజిస్ట్రేషన్లను పరిశీలించనుంది. ఈ అక్రమాల గుట్టు విప్పేందుకు మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల రిజిస్ట్రార్లు ట్వింకిల్ జాన్, సుభాషిణిలో రంగంలోకి దిగారు. వాస్తవానికి అక్రమాలు ఎక్కువగా జరిగినట్లు ఫిర్యాదులు ఎదుర్కొంటున్న కూకట్పల్లి, బాలానగర్ కార్యాలయాలపై విచారణ చేయాలన్న డిమాండ్ ఉంది. దీంతో ప్రభుత్వం ఏకంగా జంట జిల్లాల్లోని 13 కార్యాలయాలపై విచారణకు ఆదేశించటంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అలజడి రేగుతోంది. కాసులు కురిపిస్తున్న నిషేధిత భూములు ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం అందుబాటులోకి తెచ్చిన ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్’ (ఏ కార్యాలయం నుంచైనా రిజిస్ట్రేషన్) జంట జిల్లాలో సబ్ రిజిస్ట్రార్లు, జిల్లా రిజిస్ట్రార్లకు కాసులు కురిపిస్తోంది. ప్రభుత్వ, భూదాన్, వక్ఫ్, దేవాదాయ, సీలింగ్ తదితర భూములను ఎట్టి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ చేయొద్దని జిల్లా కలెక్టర్లు రిజిస్ట్రేషన్ శాఖకు ఆదేశాలు ఇచ్చారు. అయినా నగరంలో భారీగా బై నెంబర్లు వేసి ఖరీదైన భూములకు రిజిస్ట్రేషన్ చేశారు. దీనికి తోడు నివాస, వాణిజ్య, వ్యవసాయ భూముల విలువను తక్కువగా చూపి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొట్టారు. ఈ వ్యవహారంపై విచారణ అధికారులుగా నియమితులైన ట్వింకిల్ జాన్, సుభాషిణి నిస్పక్షపాతంగా విచారణ జరిపి, వీలైనంత త్వరగా ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారా.. లేక, వత్తిళ్లకు లొంగిపోతారా.. అన్న అంశాన్ని ఆశాఖ ఉద్యోగులు, సిబ్బందే ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎనీవేర్ రిజిస్ట్రేషన్‌లో భారీగా అక్రమాలు చోటు చేసుకుంటున్న విషయాన్ని గమనించిన ప్రభుత్వం.. త్వరలో పలు మార్పులు చేయనున్నట్లు సమాచారం. ముఖ్యంగా సంబంధిత రిజిస్ట్రార్‌కు ముందస్తు సమాచారం ఇచ్చి, అక్కడి నుంచి క్లియరెన్స్ వచ్చాకే డాక్యుమెంట్ రిలీజ్ చేయాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. అక్రమాల ఆనవాళ్లు ఇవిగో.. ► అత్తాపూర్ ఎంఎం పహాడీ ప్రాంతంలో 355/1,2,3 నంబర్ల అత్యంత విలువైన వక్ఫ్ భూమి వివాదం కోర్టులో ఉండగా ఓ స్థిరాస్తి సంస్థ చేసిన ప్లాట్లను బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దర్జాగా రిజిస్ట్రేషన్ చేసేశారు. ► మియాపూర్ మదీనాగూడ గ్రామ సర్వే నంబర్ 100లో 277 ఎకరాలు, 101లో 268 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూములను రిజిస్టర్ చేయవద్దని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రొహిబిటెడ్ జాబితాను అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపారు. కానీ 100 సర్వే నెంబర్ పక్కన నెంబర్లు, అక్షరాలు చేర్చి కూకట్పల్లి, బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేశారు. ► ఎల్బీనగర్ పరిధిలోని తుర్కయాంజిల్, రామన్నగూడ తదితర ప్రాంతాల్లో హార్డ్‌వేర్ పార్కు సేకరణ పరిధిలో ఉన్న భూములను ప్రొహిబిటెడ్ జాబితాలో ఉంచారు. అయినా నాలుగింతల మొత్తాలు తీసుకుని రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు. ► శేరిలింగంపల్లి గోపన్‌పల్లి సర్వే నెంబర్ 124లో 279.38 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఐటీ కంపెనీలకు కేటాయించిన భూమి మినహా, మిగతా దాన్ని ప్రొహిబిటెడ్ జాబి తాలో చేర్చి రిజిస్ట్రేషన్లు చేయరాదని 2007లోనే నిర్ణయించారు. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ నిర్ణయంతో కూకట్పల్లి, బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆ ప్రక్రియ పూర్తి చేశారు. -
వక్ఫ్ భూముల ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు
కర్నూలు(అగ్రికల్చర్): వక్ఫ్ భూములను ఆక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటూ జిల్లా జాయింట్ కలెక్టర్ సి.హరికిరణ్ హెచ్చరించారు. ఇటీవల ‘సాక్షి’లో వక్ఫ్ భూముల అన్యాక్రాంతంపై వరుస కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ కథనాలకు స్పందించి శుక్రవారం జేసీ తన చాంబర్లో ప్రత్యేక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 2,500 ఎకరాల వక్ఫ్ భూముల దురాక్రమణలో ఉన్నాయని, వీటిని స్వాధీనం చేసుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. వక్ఫ్ భూములను ఆక్రమించినవారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని తెలిపారు. కల్లూరులో 535 ఎకరాల వక్ఫ్ భూములు దురాక్రమణలో ఉన్నాయని, అక్రమణదారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. 535 ఎకరాల భూములకు వక్ఫ్సంస్థ పేరు మీద పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేయాలని సంబంధిత తహశీల్దార్‌ను ఆదేశించారు. ఈ భూములను స్వాధీనం చేసుకోవడానికి జాప్యం చేవద్దని తెలిపారు. డోన్‌లో సర్వే నంబర్ 264లో 5-82 ఎకరాలు, సర్వే నంబర్ 2-15లో 15.88 ఎకరాలను 50 మంది ఆక్రమించారని ఈ భూములు వక్ఫ్వి అయినందున స్వాధీనం చేసుకోవాలన్నారు. ఆక్రమణదారులను వెంటనే నోటీసులు జారీ చేయించాలని, ఇందుకోసం పోలీసుల సహాయం తీసుకోవాలన్నారు. బనగానపల్లె, నందవరం, కర్నూలు ఫోర్త్‌టౌన్, శిరువెళ్ల పోలీస్స్టేషన్లలో వక్ఫ్ భూములు ఆక్రమించినవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని తెలిపారు. కర్నూలులోని సర్వే నంబర్ 62లో వక్ఫ్ భూమిలో నీళ్ల ట్యాంకు నిర్మించారని, ఇందుకోసం ఎంతమేర వక్ఫ్ భూమిని తీసుకొని ఉంటే అంతే భూమిని మరోచోట గుర్తించి వక్ఫ్ బోర్డుకు అప్పగించాలన్నారు. వక్ఫ్ భూములు ఆక్రమించిన వారు ఎంతటివారైనా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్వో గంగాధర్‌గౌడు, మైనార్టీ సంక్షేమాధికారి షేక్ మస్తాన్ వలి, వక్ఫ్‌బోర్డు ఇన్స్పెక్టర్లు ముస్తాక్ బాషా, అల్తాఫ్ హుసేన్, అజీమ్, వక్ఫ్ ల్యాండ్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
భూంఫట్‌పై సభాసంఘాలు
హౌసింగ్ సొసైటీలకు భూ కేటాయింపులు, వక్ఫ్ భూముల అన్యాక్రాంతంపై విచారణ: స్పీకర్ జూబ్లీహిల్స్ సొసైటీ పేరుతో భారీగా ‘రియల్’ వ్యాపారం: సీఎం సత్వరం నివేదిక తెప్పిస్తాం.. వక్ఫ్ భూముల్ని పరిరక్షిస్తాం సభలో కేసీఆర్ సవివర ప్రకటన విచారణ పరిధిలోకి టీఎన్జీవో సొసైటీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా సహకార గృహ నిర్మాణ సంఘాలకు (కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ) భూ కేటాయింపులు, వక్ఫ్‌భూముల అన్యాక్రాంతంపై విచారణకు రెండు సభాసంఘాలు ఏర్పాటయ్యాయి. స్పీకర్ మధుసూదనాచారి గురువారం అసెంబ్లీలో ఈ మేరకు ప్రకటన చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, ఫిలింనగర్ గృహ నిర్మాణ సొసైటీలతో పాటు అందుల్లో ప్రమేయం ఉన్న వక్ఫ్ భూముల్లో అక్రమాలకు సంబంధించి అసెంబ్లీ నిబంధనావళిలోని 74వ నియమం కింద ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్, మరో నలుగురు సభ్యులు ఇచ్చిన నోటీసుకు సంబంధించి సభలో చర్చ జరిగింది. ఈ విషయమై విపక్ష సభ్యులు వెలిబుచ్చిన ఆందోళనతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఏకీభవించారు. సభాసంఘాలు వేసేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరమూ లేదని ప్రకటించారు. వీలైనంత తొందరగా విచారణ జరిపించి నివేదికలు తెప్పించుకోవాల్సిన అవసరముందన్నారు. ‘జూబ్లీహిల్స్, ఫిల్మ్నగర్లలోని వక్ఫ్‌భూములను పరరక్షిస్తాం. వాటిని కేటాయించిన అవసరాల నిమిత్తమేవినియోగించేలా చూస్తాం’ అని ప్రకటించారు. జూబ్లీహిల్స్ సహకార గృహనిర్మాణ సొసైటీకి భూ కేటాయింపు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారిందని ఈ సందర్భంగా సీఎం సోదాహరణంగా వివరించారు. ‘‘జూబ్లీహిల్స్ సొసైటీకి 1964 జనవరి 31న ఎకరాకు రూ.200 చొప్పున మార్కెట్ విలువ చెల్లింపుపై షేక్‌పేట, హకీంపేట గ్రామాల్లో 1,398 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. స్థలాల కేటాయింపులో భారీగా అక్రమాలు జరిగినపట్టు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, సహకార శాఖ విచారణల్లో తేలింది. సభ్యుల ఎంపిక తదితరాల్లో సొసైటీ సరిగా వ్యవహరించలేదు .గతంలో మేనేజింగ్ కమిటీ సభ్యులుగా ఉన్న టీఎల్ ప్రసాద్, ఎన్ఎం చౌదరి, జి.నరసింహారావు, వెంకటేశ్వరరావు, సి.కృష్ణమూర్తి, పి.సుబ్బారావు తమ బంధువులు, బినామీ పేర్లపై ఎన్నో ప్లాట్లు కేటాయించారు. ఇతర జిల్లాలు, రాష్ట్రాలు, విదేశాల్లో నివసిస్తున్నవారిని కూడా అర్హులు కాకున్నా సభ్యులుగా చేర్చుకున్నారు. సొంతిళ్లున్న సీనియర్ ప్రభుత్వోద్యోగులను కూడా చేర్చుకోవడం, ఇతరులకు (థర్డ్ పార్టీకి) అక్రమంగా ప్లాట్లను బదిలీ చేయడం తదితరాల వల్ల వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న వాస్తవ సభ్యులకు ప్లాట్ల కేటాయింపు జరగలేదు. విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా 2002 మేనేజింగ్ కమిటీని రద్దు చేసి విచారణ ప్రారంభించారు. ఇప్పుడిది సీఐడీ విచారణలో ఉంది. ఫిలింనగర్ సొసైటీలోనూ సినీ పరిశ్రమకు చెందనివారికి ప్లాట్ల కేటాయింపు, బయటి వ్యక్తులకు ప్లాట్ల బదిలీల్లో సొసైటీలలో ఆర్థిక, పరిపాలక అక్రమాల వంటివి జరిగినట్టు విచారణాధికారి తేల్చారు. ఇందులో సినీయేతరసభ్యులు 10 శాతంగా ఉండాల్సింది 17.53 శాతమున్నారు. ప్రస్తుత కార్యదర్శికి ద్వంద్వ సభ్యత్వం, సభ్యుల ద్వారా ప్లాట్ల పునర్విభజన, బయటి వ్యక్తులకు విక్రయాలు, ఒకే కుటుంబంలో దగ్గరి బంధువులకు సభ్యత్వాలు, అర్హులకు ప్లాట్లివ్వకపోవడం, నివాస ప్లాట్లలో వాణిజ్య భవనాల నిర్మాణం వంటి అక్రమాలను గుర్తించాం’’ అని సీఎం వివరించారు. విచారణకు అక్బర్ డిమాండ్ వక్ఫ్‌భూముల అన్యాక్రాంతంపై సభాసంఘం, లేదా రిటైర్ట్ జడ్జితో నిర్ణీత కాలవ్యవధిలో న్యాయ విచారణ జరిపించాలని అంతకుముందు చర్చను ప్రారంభించిన అక్బర్ డిమాండ్ చేశారు. ‘‘జూబ్లీహిల్స్, ఫిలింనగర్, నందగిరి, జర్నలిస్టుల సహకార గృహ నిర్మాణ సొసైటీల్లో భూముల కేటాయింపుల్లో కనీసం రూ.500 కోట్ల మేరకు అక్రమాలు జరిగాయి. హకీంపేట వద్ద 218.32 ఎకరాల హజరత్ హకీంషా సాహెబ్ బాబా దర్గా భూమి 400 ఏళ్లకు పైగా పురాతనమైనది. ఇది కచ్చితంగా వక్ఫ్దేనని నిరూపించగలను’’ అని చెప్పారు. వక్ఫ్‌భూముల ఆక్రమణలు నిజమేనని కేసీఆర్ బదులిచ్చారు. ఈ సొసైటీల వ్యవహారంలో దోషులను కాపాడేందుకు టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రయత్నించాయని అక్బర్ ఆరోపించారు. వీటిపై గతంలో జిల్లా అధికారి కిరణ్మయి ఇచ్చిన విచారణ నివేదికను ఎందుకు దాచారని, అందులో ఏముందని ప్రశ్నించారు. దాన్ని సభ ముందుంచాలని డిమాండ్ చేశారు. ఫిలింనగర్ సొసైటీలో సినిమా పరిశ్రమకు చెందని టి.చిన్నప్పరెడ్డికి 7 ప్లాట్లు కేటాయించారని సభ దృష్టికి తెచ్చారు. జూబ్లీహిల్స్ సొసైటీలో చివరికి పార్కు, బస్సు డిపో తదితరాలను కూడా వాణిజ్య అవసరాలకు మార్చేశారంటూ ధ్వజమెత్తారు. మాకెలాంటి శషభిషలూ లేవు: కేసీఆర్ తెలంగాణ నాన్ గెజిటెడ్ గృహ నిర్మాణ సంఘానికి కేటాయించిన భూముల్లో కూడా అనర్హులకు కేటాయింపులతో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ప్రస్తావించారు. దీన్ని కూడా సభాసంఘం విచారణ పరిధిలో చేర్చాలని కోరారు. అందులో అక్రమాలు నిజమేనని అక్బర్ కూడా అన్నారు. అలా చేర్చేందుకు తమకెలాంటి శషభిషలూ లేవని కేసీఆర్ బదులిచ్చారు. తెలంగాణలోని పది జిల్లాల్లోని అన్ని సహకార హౌసింగ్ సొసైటీల భూముల్లో జరిగిన అక్రమ కేటాయింపులపైనా సభా సంఘంతో విచారణ చేయిద్దామన్నారు. ఈ అంశంపై మాట్లాడేందుకు తమకు అవకాశమివ్వాలని టీడీపీ సభ్యులు ఎర్రబెల్లి దయాకరరావు, రేవంత్‌రెడ్డి కోరారు. రేవంత్ మాట్లాడేందుకు ప్రయత్నించిన ప్రతిసారీ ఆయన క్షమాపణ చెప్పాల్సిందేనని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గట్టిగా డిమాండ్ చేశారు. టీడీపీ వారికి ఒక నిమిషం అవకాశం ఇవ్వాలని సీఎల్పీ నేత కె.జానారెడ్డి కోరగా అధికార పక్షం అంగీకరించింది. -
వక్ఫ్ భూముల కబ్జాపై విచారణ జరపండి: అక్బరుద్దీన్ ఒవైసీ
* ప్రభుత్వానికి ఎంఐఎం నేత అక్బరుద్దీన్ వినతి * కబ్జాదారులెవరో తేల్చండి * సభలో శ్వేతపత్రం పెట్టండి * మూసీ నదిని శుద్ధి చేయండి * మైనారిటీలకు గృహాలు నిర్మించండి సాక్షి, హైదరాబాద్: ఆక్రమణకు గురైన వేలాది ఎకరాల వక్ఫ్ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ సోమవారం అసెంబ్లీలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మైనారిటీ సంస్థలు, వక్ఫ్ ఆస్తులు ఎవరి కబ్జాలో ఉన్నాయో సీబీసీఐడీతో విచారణ జరిపించాలని కోరారు. వక్ఫ్ ఆస్తులపై శ్వేత పత్రం సమర్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వక్ఫ్ భూముల్లో 76 శాతం ఆక్రమణలోనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాయదుర్గం భూములు మొదలు బహుళ జాతి కంపెనీలకు ధారాదత్తం చేసిన భూములన్నీ వక్ఫ్‌కు చెందినవేనని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హయాంలో భూసంస్కరణల పేరుతో జమీందార్లు, భూస్వాముల నుంచి వేలాది ఎకరాలు స్వాధీనం చేసుకున్న ప్రభుత్వాలు వాటిని బహుళ జాతి కంపెనీలకు కట్టబెట్టాయని... ముస్లిం నిరుపేదలకు ఒక్క ఎకరం భూమిని కూడా కేటాయించలేదని అన్నారు. హుస్సేన్ సాగర్‌ను శుద్ధి చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందిస్తూనే.. మూసీ నదిని కూడా శుద్ధి చేయాలని కోరారు. హుస్సేన్ సాగర్ చుట్టూ ప్రపంచంలోనే ఎత్తై భవనాలు నిర్మిస్తామంటున్న ప్రభుత్వం.. హైదరాబాద్‌లో నిరుపేదలు తల దాచుకునేందుకు రెండు గదుల ఇళ్ల నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. మైనారిటీ విద్యార్థుల ఉపకార వేతనాల బకాయిలకు సరిపడే నిధులను ఈ బడ్జెట్లో కేటాయించలేదని అన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ఒక మైనారిటీ సభ్యుడిని నియమించాలని కోరారు. తొమ్మిది జిల్లాల్లో ఉర్దూను రెండో అధికార భాషగా పరిగణిస్తుంటే ఖమ్మం జిల్లాను ఎందుకు మినహాయించారని ప్రభుత్వాన్ని నిల దీశారు. మైనారిటీ సంక్షేమశాఖ, మైనారిటీ కమిషన్, వక్ఫ్ బోర్డుల విభజన ఇంకా జరగలేదని.. ఎప్పుడు జరుగుతుందో చెప్పాలని కోరారు. వక్ఫ్ భూములు కాపాడుతాం: మహమూద్ వక్ఫ్ ఆస్తులు.. ఆక్రమణలో ఉన్న వక్ఫ్ భూములను పరిరక్షించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుందని ఉపముఖ్యమంత్రి మ హమూద్ అలీ ప్రకటించారు. అక్బరుద్దీన్ ప్రసంగానికి సమాధానంగా ఆయన మాట్లాడుతూ, మైనారిటీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల బకాయి లు త్వరలోనే చెల్లిస్తామన్నారు. కాగా, అక్బర్ ప్రసంగం మధ్యలో స్పందించిన ఆర్థికశాఖ మంత్రి ఈటెల మాట్లాడుతూ, సమైక్య రాష్ట్రంలో మైనారిటీలను ఎన్నికల కోణంలోనే చూశారని, తెలంగాణ ప్రభుత్వం మైనారిటీల అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని ప్రకటించారు. సీమాంధ్ర పాలకులకు ముస్లింల సంక్షేమం కనిపించలేదని, నిజాం నవాబు కూడబెట్టిన లక్షలాది ఎకరాల భూములు మాత్రమే కనిపించాయని అన్నారు. మైనారిటీ విభాగానికి రూ.1038 కోట్లు కేటాయించామని తెలిపారు. -
ప్లాట్ అవుతారు.. జాగ్రత్తా!
సార్.. మా వెంచర్‌కు అన్ని రకాల పర్మిషన్లున్నాయి. మీరు ఒక్కసారి చూడండి.. అంటూ వెంచర్ దగ్గరకు తీసుకెళ్తాడు ఏజెంట్. ఇది కార్నర్ ప్లాట్.. ఈస్ట్ప్లేస్. నిన్ననే ఇద్దరు, ముగ్గురు చూసి వెళ్లారు. మీరు సరే అంటే వెంటనే బుక్ చేస్తా. ఇలా ఆయన చెప్పే మాటలకు మనం వెంటనే ప్లాట్ అయిపోతాము. ఇంతకు ఈ భూమి వ్యవసాయభూమి నుంచి వ్యవసాయేతర భూమిగా మార్చారా లేదా అన్న అంశాన్ని పరిశీలించం. పంచాయతీ, మునిసిపల్ నిబంధనల ప్రకారం లే అవుట్లు వేశారా లేదా అని చూడం. వెంటనే ఓకే అనేస్తాం. కొనేస్తాం. తర్వాత నానా ఇబ్బందులుపడతాం. ఎలాంటి భూములు కొనాలి, ఏ స్థలాలకు అమ్మే హక్కు ఉండదనే కనీస పరిజ్ఞానం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. * కొనుగోలులో జాగ్రత్తలు తప్పనిసరి * లేకపోతే భవిష్యత్తులో చిక్కులు తప్పవు కర్నూలు (జిల్లా పరిషత్): రాష్ట్ర విభజన అనంతరం ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు కురిపిస్తున్న హామీలతో జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం విస్తరిస్తోంది. ఒకప్పుడు నంద్యాల రోడ్డులో సఫా ఇంజనీరింగ్ కళాశాల వరకు మాత్రమే రియల్ ఎస్టేట్ వెళ్లి ఆగిపోయింది. నాయకులు హామీల పుణ్యమా అని ఇప్పుడు విస్తరణ ఓర్వకల్లు మండలం హుసేనాపురం దాటిపోయింది. ఓర్వకల్లు సమీపంలో ఇండస్ట్రియల్ కారిడార్, ఎయిర్పోర్ట్, ఐఐఐటీ అంటూ ప్రజలను నాయకులు ఊరిస్తున్నారు. ఇదే అదనుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం విస్తరిస్తోంది. ఆదోని, ఎమ్మిగనూరు మధ్యలో టెక్ట్స్‌టైల్స్ పార్కు వస్తుందని చెప్పడంతో కోడుమూరు రోడ్డులోనూ వెంచర్లు పుట్టుకొచ్చాయి. కర్నూలు కొత్తబస్టాండ్‌కు అతి దగ్గరల్లో ఉందంటూ పెంచికలపాడు, కొత్తూరు వరకు రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిశాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇబ్బడిముబ్బడిగా వ్యవసాయ భూములు కొని వెంచర్లు వేస్తున్నారు. ప్లాటు రూ.1.50లక్షల నుంచి రూ.2.50లక్షలేనని ఊరిస్తున్నారు. ఇండిపెండెంట్ హౌస్ సైతం రూ.12లక్షల నుంచి రూ.20లక్షలలోపు అందిస్తామంటూ ప్రకటనలతో ఊదరగొడుతున్నారు. వాటిని చూసి వెంటనే కొన్ని మోసపోకుండా కొన్ని విషయాలు గమనించి స్థలాలు కొనాలి. ఈ భూములు కొనకూడదు.. అమ్మకూడదు * ప్రభుత్వానికి సంబంధించిన భూములు, వక్ఫ్‌భూములు * భూదాన్ బోర్డు ఆధీనంలో స్థలాలు * వెనుకబడిన వర్గాలకు కేటాయించినవి * ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధిపొందిన వారికి ఇచ్చిన ఇళ్లు, పొలాలు * యూఎల్సీ పరిధిలోని భూములు * సైనికులకు, స్వాతంత్య్ర సమరయోదులకు కేటాయించిన భూములు, స్థలాలు * గిరిజనులకు ప్రభుత్వం కేటాయించిన భూములు కొనబోయే భూమి సమాచారం ఎలా తెలుసుకోవాలి * భూమిని ఎక్కడ కొనాలనుకుంటున్నారో ఆ ఏరియా పరిధిలోకి వచ్చే సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తు చేయాలి. * భూమి ఉన్న సర్వే నెంబర్, ప్లాట్ నెంబర్, పట్టా లేక పాస్బుక్ల జిరాక్స్ వివరాలు అందిస్తే వారు మీకో మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్ జారీ చేస్తారు. * ఇందులో మీరు కొనాలనుకున్న భూమి విలువ, ఆ భూమి ఏ ప్రభుత్వ శాఖ ఆధీనంలో ఉంది, ఎప్పటి నుంచి ఉంది, భూమిని ఎవరికి కేటాయించారు తదితర వివరాలుంటాయి. * బ్యాంకులోను పొందడానికి సైతం ఈ మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్ ఉపయోగపడుతుంది. ఈ జాగ్రత్తలు తప్పనిసరి * రియల్ ఎస్టేట్ వెంచర్ వేసే ముందు ఆయా భూమి వ్యవసాయభూమి నుంచి వ్యవసాయేతర భూమిగా మార్చారా లేదా అన్న అంశాన్ని పరిశీలించాలి. ఇందుకోసం రెవిన్యూ అధికారులకు నాలా పన్ను 10 శాతం చెల్లించి భూమి మార్పిడి చట్టం ద్వారా మార్చుకోవాల్సి ఉంటుంది. * లే అవుట్లు లేని నివేశన స్థలాలకు పంచాయతీలు/మునిసిపాలిటీలు ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టరు. కొత్తగా రోడ్ల నిర్మాణం, డ్రెయిన్లు తదితర మౌలిక సదుపాయాలూ కల్పించరు. * లే అవుట్ వేసిన మొత్తం భూమిలో 10 శాతం భూమిని సామాజిక అవసరాల కోసం (కమ్యూనిటి హాళ్లు, పాఠశాల నిర్మాణం, పార్కు) రిజర్వుడ్ సైట్‌గా వదలాల్సి ఉంటుంది. * ఈ స్థలాన్ని రియల్టర్ ఆయా పంచాయతీలు, మునిసిపాలిటీలకు రిజిస్ట్రేషన్ ఫీజు కింద గిఫ్ట్‌గా రాసి ఇవ్వాలి. * మునిసిపల్ నిబందనల ప్రకారం అంతర్గత రోడ్లు అయితే 40 అడుగులు, ప్రధాన రహదారి అయితే 60 అడుగుల వెడల్పు ఉండాలి. తారు రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం రియల్టరే చేపట్టాలి. * మంచినీటి ట్యాంకు నిర్మించి ప్రతి ప్లాటుకు కనెక్షన్ ఇవ్వాలి. * త్రీ ఫేస్ కరెంటుతో వీధిలైట్లు ఏర్పాటు చేయాలి. లే అవుట్ల గురించి పూర్తిగా చెక్ చేసుకోవాలి కార్పొరేషన్ పరిధిలోని ప్రతి లే అవుట్‌కు 40 అడుగుల వెడల్పుతో రోడ్డు ఉండాలి. 10 శాతం స్థలాన్ని కార్పొరేషన్‌కు గిఫ్ట్ కింద ఇవ్వాలి. కార్పొరేషనేతర ప్రాంతాల్లో వేసిన లే అవుట్లలో 33 అడుగుల వెడల్పుతో రోడ్డు ఉండాలి. ప్రతి ప్లాటు తప్పనిసరిగా 120 చదరపు మీటర్లు ఉండాలి. 2.5ఎకరాల వరకు కర్నూలులోనే అనుమతినిస్తాం. 2.5 ఎకరాలు దాటి 5 ఎకరాల వరకు అనంతపురంలోని రీజనల్ కార్యాలయం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. లే అవుట్ల గురించి మునిసిపల్ కార్పొరేషన్, గ్రామపంచాయతీల్లో చెక్ చేసుకుని ప్లాట్లు కొనుగోలు చేసుకుంటే భవిష్యత్‌లో ఇబ్బందులు ఉండదు. -బి. ప్రసాదరావు, డిస్ట్రిక్ట్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆఫీసర్ -
కాసుల వక్ఫ్ భూములు
సాక్షి, ఖమ్మం: ఒకప్పుడు మసీదులకు ఆదాయ వనరులుగా ఉన్న వక్ఫ్ భూములు నేడు అన్యాక్రాంతమయ్యాయి. బహిరంగ మార్కెట్లో ఈ భూములకు రూ.కోట్లు పలుకుతుండటంతో వీటిపై కబ్జాదారుల కన్నుపడింది. అధికారులు, మసీదు సంరక్షకుల చేయి తడిపి అందినకాడికి కాజేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న వక్ఫ్ భూముల్లో వందలాది ఎకరాల భూములు ఆక్రమణకు గురయ్యా యి. ఇవి వక్ఫ్ భూములని తెలిసి కూడా అధికారులు కబ్జాదారులకు సహకరించి యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు చేస్తుండటం గమనార్హం. వక్ఫ్‌భూములు మసీదుల అభివృద్ధికి ఆదాయ వనరుగా ఉండాలి. ఈ భూముల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఏటా ఆయా మసీదు కమిటీల పేరున బ్యాంకు ఖాతాలో జమ చేసి ఖర్చు చేయాలి. కానీ ఈ పరిస్థితి మారిపోయింది. ఇవి ప్రభుత్వ భూములైనా బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం చూస్తే రూ.కోట్లు పలుకుతున్నాయి. ఖమ్మం నగ రం, పాల్వంచ, బూర్గంపహాడ్, వేంసూరు, కల్లూరు, బోనకల్, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ , కొణిజర్ల, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో విలువైన వక్ఫ్ భూములున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ భూములను క్రయవిక్రయాలు చేయకూడదు. కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఈ వక్ఫ్ ఆస్తులను పరిరక్షించాలి. అయితే జిల్లాలో రెవెన్యూ రికార్డుల ప్రకారం వక్ఫ్ భూములు వందల ఎకరాలు ఉన్నట్లు కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడికక్కడ అన్యాక్రాం తమయ్యాయి. ముతావలి(సంరక్షకులు)లు ఈ భూములను అన్యాక్రాంతం కాకుండా చూడాలి. ఇటీవల రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడంతో ఖమ్మం నగరం, ప్రధాన పట్టణాల్లో ఉన్న వక్ఫ్ భూములకు ధర పెరిగింది. సంరక్షకులుగాా ఉన్న వీరు కబ్జాదారుల మాయలో చిక్కుకుని ఈ భూములను వారికి దొడ్డిదారిన అమ్మేస్తున్నారు. కాసుల భూములు..: ఖమ్మం నగరంలో గత పదిహేనేళ్లలో 170 ఎకరాలకు పైగా వక్ఫ్ భూములు కబ్జాకు గురయ్యాయి. ఖమ్మం నగరం కార్పొరేషన్‌గా అవతరించి భూముల ధరలు పెరగడంతో ఇంకా ఈ ఆక్రమణల పరంపర కొనసాగుతూనే ఉంది. నగరంలోని జామామసీదు, ముస్తఫానగర్, గొల్లగూడెం, మున్నేరు నది సమీపం, బుర్హాన్‌పురం, ఖజాయిత్, షాహిద్ దర్గా ప్రాం తం, ఓల్డ్ క్లబ్, కస్పాబజార్ సమీపంలో ఈ భూములను ఆక్రమించడంతోపాటు రిజిస్ట్రేషన్లు చేసుకుని పెద్దపెద్ద భవనాలే నిర్మిం చారు. వీటికి కార్పొరేషన్ నుంచి కూడా అన్ని అనుమతులు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ముతావలీలు మారుతుండటంతో వీరంతా ఈ భూములను అక్రమంగా కబ్జా చేశారనే ఆరోపణలు వినపడుతున్నాయి. అలాగే వైరా, ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల, మధిర మం డలం మాటూరు, కొణిజర్ల మండలం అమ్మపాలెంలో కూడా ఈ భూములను ఆక్రమిం చారు. బోనకల్ మండలం నాగులవంచ, వేంసూరు రెవెన్యూ పరిధిలో, పాల్వంచ, ఎర్రుపాలెం మండలం రెమిడిచర్ల, బూర్గం పాడు మండలం నాగినేనిప్రోలులో కబ్జాలు యథేచ్ఛగా సాగాయి. అధికారుల కన్నుసన్నల్లోనే... మండలస్థాయిలో మసీదుల ఆధ్వర్యంలో ఉన్న వక్ఫ్ భూములకు ముతావలిలు సంరక్షకులు. ఇక అవి కబ్జాకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉంది. మసీదుల భూములను కబ్జా చేస్తున్నారని కొంతమంది మత పెద్దలు మండల, జిల్లాస్థాయి అధికారులకు మొరపెట్టుకుంటున్నా ఫలితం శూన్యం. ఈ భూములకు స్థానిక అధికారులే నో అబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) ఇస్తుండటంతో ఆక్రమణలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. అధికారులకు ముడుపులు ముట్టచెబుతుండటంతో తప్పుడు డాక్యుమెంట్లతో కబ్జాదారులు రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. కబ్జా అవుతున్నట్లు ఇచ్చే ఫిర్యాదులపై కొంతమంది అధికారులు స్పందిస్తూ క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లినా ముతావలిలు వీరిని బురిడీ కొట్టిస్తున్నట్లు సమాచారం. ఎస్పీకి ఫిర్యాదు..: వేంసూరు గ్రామ రెవెన్యూ పరిధిలో రూ.లక్షల విలువ చేసే మసీదు భూములు ఆక్రమణలో ఉన్నాయని, వీటిని రక్షించాలని కోరుతూ గ్రామానికి చెందిన కొంతమంది ముస్లింలు ఇటీవల ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గ్రామ రెవెన్యూ పరిధిలో 70 ఎకరాల వరకు వక్ఫ్ భూములున్నాయి. ఇందులో 10 ఎకరాల వరకు ఆక్రమణకు గురైనట్లు వారు ఎస్పీకి వివరించారు. అంతేకాకుండా ఉన్న భూముల నుంచి వచ్చే ఆదాయాన్ని మసీదు అభివృద్ధికి వెచ్చించకుండా ముతావలిల వారసులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఆక్రమణలో ఉన్న భూములపై గతంలో పలుమార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఎస్పీకి అందించిన ఫిర్యాదులో పేర్కొన్నారు.