సాక్షి, అమరావతి: మహోన్నత ఆశయంతో దాతలు ఇచ్చిన వక్ఫ్ భూములు, ఆస్తులను ఆక్రమణల నుంచి కాపాడతామని ఎన్నికలకు ముందు సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చింది. రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తులను ఆక్రమించిన వారిపై వక్ఫ్ బోర్డు కొరడా ఝళిపిస్తోంది. ఆస్తులను ఆక్రమణల చెర నుంచి విడిపించి స్వాధీనం చేసుకునే ప్రక్రియ వేగంగా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సర్వే ద్వారా ఆక్రమణలో ఉన్న వక్ఫ్ ఆస్తులను గుర్తిస్తున్నారు.
తొలి దశలో కొన్ని ఆస్తులు గుర్తించగా, రెండో దశ సర్వే వేగంగా సాగుతోంది. ఈ సర్వే ద్వారా అన్యాక్రాంతమైనట్టు గుర్తించిన ఆస్తులను వక్ఫ్ బోర్డు పరిధిలోని టాస్‌్కఫోర్స్ విభాగం స్వాదీనం చేసుకుంటోంది.
వక్ఫ్ బోర్డు ప్రత్యేక అధికారి షేక్ షిరీన్ బేగం పర్యవేక్షణలో అధికారులు, మైనారిటీ సంక్షేమ శాఖ, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. గత 15 రోజులుగా రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు తీసుకున్న కొన్ని ప్రధాన చర్యలు..
♦ నంద్యాల పట్టణంలోని నూనెపల్లి – రైతు నగరం ప్రాంతాల మధ్య వక్ఫ్ భూముల్లో వ్యాపార సముదాయాలు నిరి్మంచిన కొందరు అక్రమార్కులకు చెక్ పెట్టారు. 231 సర్వే నంబర్‌లో 3.89 ఎకరాలు, 47వ సర్వే నంబర్‌లో 7.48 ఎకరాలు, 22వ సర్వే నంబర్‌లో 5.92 ఎకరాలకు నోటీసులు జారీ చేసి ఆక్రమణల తొలగింపు ప్రక్రియ చేపట్టారు.
♦ అన్నమయ్య జిల్లావ్యాప్తంగా ఉన్న వక్ఫ్ బోర్డు భూములను ప్రత్యేకాధికారి షిరీన్ బేగం బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. గువ్వల చెరువు, రహీంషా వలి దర్గా, రాయచోటి జామియ మసీదు ఆస్తులవాస్తవ పరిస్థితులు, రికార్డులను పరిశీలించింది. ఇవి అన్యాక్రాంతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక సిద్ధం చేసింది.
♦ రాయచోటి దర్గా భూమిని, దుకాణాల్లో ఆక్రమణలు లేవని గుర్తించి అటాచ్ చేశారు.
♦పల్నాడు జిల్లాలో అన్యాక్రాంతమైన వక్ఫ్ భూముల్లో ఆక్రమణలు తొలగించి సంబంధిత శాఖకు అందించాలని ఆ జిల్లా కలెక్టర్ శివశంకర్ ఇటీవల రెవెన్యూ అధికారులను ఆదేశించారు. దీనిపై కార్యాచరణ కోసం వక్ఫ్ భూముల పరిరక్షణ కమిటీ తొలి సమావేశాన్ని నిర్వహించారు.
♦ వినుకొండలో అన్యాక్రాంతమైన మసీదు మాన్యం భూమి స్వా«దీనానికి చర్యలు చేపట్టారు. తిమ్మాయపాలెంలో ఆక్రమణకు గురైన ఆరు ఎకరాలపై కార్యాచరణ సిద్ధం చేశారు.
♦ ఇచ్చాపురం మున్సిపాలిటీలో ఆక్రమణలకు గురైన స్థలాలు, అమ్మకాలు జరిపిన ఆస్తుల రికార్డులు పరిశీలించారు. వక్ఫ్ బోర్డుకు చెందిన మసీదులు, శ్మశాన వాటికలు పరిశీలించారు. ఇచ్చాపురం హాస్పిటల్ రోడ్డులో వక్ఫ్ ఆస్తుల ఆక్రమణలను గత నెల 21న తొలగించారు. వక్ఫ్ స్థలంలో వివాదాస్పదంగా మారిన కంటైనర్‌ను తొలగించారు. 4.82 ఎకరాల విస్తీర్ణంలో 30 ఏళ్లుగా షాపులు ఆక్రమించుకుని వ్యాపారాలు చేస్తున్న 24 మంది దుకాణదారులను ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు.
సీఎం ఆదేశాలతో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ
సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో వక్ఫ్ భూములు, ఆస్తుల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాం. అన్యాక్రాంతమైన ఆస్తులను స్వా«దీనం చేసుకుంటున్నాం. ప్రభుత్వ శాఖల సహకారంతో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ చర్యలు చేపట్టాం. వక్ఫ్ బోర్డుకు చెందిన గజం భూమిని కూడా వదలం. ఆక్రమణలు ఖాళీ చేయకపోతే చట్టప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. – షేక్ షిరీన్‌బేగం, వక్ఫ్‌బోర్డు ప్రత్యేకాధికారి
Comments
Please login to add a commentAdd a comment