'చెస్ట్ ఆస్పత్రి తరలింపు ఏకపక్ష నిర్ణయం' | government taken an Arbitrary decision | Sakshi
Sakshi News home page

'చెస్ట్ ఆస్పత్రి తరలింపు ఏకపక్ష నిర్ణయం'

Published Tue, Feb 3 2015 4:16 PM | Last Updated on Sat, Sep 2 2017 8:44 PM

government taken an Arbitrary decision

హైదరాబాద్: చెస్ట్ ఆస్పత్రిని తరలించాలంటూ కేసీఆర్ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన రెడ్డి అన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలను సంప్రదించకపోవడం సరికాదని హితవు పలికారు. అఖిలపక్షం, అసెంబ్లీల్లో  చర్చించాకే సచివాలయం, చెస్ట్ ఆస్పత్రిని తరలించాలని ఆయన తెలిపారు. ప్రస్తుతం రంగారెడ్డికి మెడికల్ కాలేజీ, జనరల్ హాస్పిటల్ ఏర్పాటుచేయాలన్నారు. సచివాలయం తరలింపుపై అవసరమైతే న్యాయపోరాటం చేస్తామన్నారు. సచివాలయం తరలించవద్దని ప్రజలనుంచి ఈ-పిటిషన్లు సేకరించి గవర్నర్ కు సమర్పిస్తామన్నారు. ఆ తరువాత ప్రజల్లోకి వెళ్లి సంతకాల సేకరణ చేపడతామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement