విదేశీయులకు దేశీ ఆతిథ్యం | Guidence Services in Hyderabad | Sakshi
Sakshi News home page

విదేశీయులకు దేశీ ఆతిథ్యం

Dec 26 2018 10:06 AM | Updated on Dec 26 2018 10:06 AM

Guidence Services in Hyderabad - Sakshi

కుతుబ్‌షా టూంబ్స్‌ ఫొటోలు తీస్తున్న నిక్‌

సాక్షి,సిటీబ్యూరో: కొత్త దేశం, కొత్త ప్రాంతం.. కొత్త నగరం.. అన్నీ చూడాలి. ఆ ప్రాంత ప్రత్యేకతలన్నీ తెలుసుకోవాలి. కానీ ఎలా..? ఇలాంటప్పుడు గూగుల్‌లో వెదికితే కావాల్సినంత సమాచారం. కానీ అదొక్కటే సరిపోదు. గైడ్‌ చేసే వారు, కొన్ని చోట్ల దగ్గరుండి ఆ ప్రాంత విశేషాలు చెప్పే వారు ఉండాలి. ముఖ్యంగా దేశం గాని దేశంలో, భాష రాని చోట అలా అన్నీ చూపించే వారుండాలి. దేశానికి వచ్చే విదేశీయులకు దగ్గరుండి అన్నీ చూపించే విధంగా ప్యాకేజీలు, సర్వీసులు అందించే సంస్థలు ఉత్తర భారతదేశంలో విరివిగా ఉన్నాయి. కానీ సాంస్కృతికంగా, చారిత్రాత్మకంగా, సాంకేతికంగా పేరొందిన హైదరాబాద్‌కి వచ్చే విదేశీ యాత్రికుల కోసం ప్రత్యేకంగా ప్యాకేజ్‌లు, గైడ్‌లు అందించే సంస్థలు ఇటీవల స్థానికంగా  ప్రారంభమయ్యాయి. 

విదేశీ యాత్రీకులకు ప్రత్యేక సర్వీసులు
హైదరాబాద్‌ను దర్శించేందుకు వచ్చే విదేశీయుల కోసమే ప్రారంభమైన సంస్థ ‘అస్లీ హైదరాబాద్‌’. టూరిజం, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేసుకున్న నాగార్జునరెడ్డి ఈ సంస్థను గత ఏడాది ప్రారంభించారు. ఒక టూర్‌లా కాకుండా నగరాన్ని అనుభూతి చెందే విధంగా దీనిని రూపొందిస్తామంటున్నారు ఆయన. బిజినెస్‌ ట్రావలర్స్‌తో పాటు, బృందాలుగా ఇక్కడికి వచ్చే విదేశీయులకు నగరంలోని చారిత్రక ప్రదేశాలను చూపిస్తారు. అలాగే, హైదరాబాద్‌ ప్రత్యేక వంటలను రుచి చూపిస్తారు. నగరానికి చెందిన ప్రముఖ, ప్రాచీన బజారుల్లో షాపింగ్‌ అనుభవాన్ని కల్పిస్తారు. ‘ఆన్‌లైన్‌ ద్వారా మా సేవలు పొందవచ్చు. స్టార్‌బక్స్‌ కో–ఫౌండర్‌ జెవ్‌ సీగల్,  పులిట్జర్‌ అవార్డు గ్రహీతలు, ఫొటో జర్నలిస్ట్‌ నిక్‌ ఉట్, బార్బరా డెవిడ్సన్‌ మా సేవలను వినియోగించుకున్న వారిలోలో ఉన్నారు. మా దగ్గర స్పానిష్, ఫ్రెంచ్, ఇటాలియన్‌ మాట్లాడే గైడ్‌లు ఉన్నారు. చారిత్రక కట్టడాలు చూపిస్తూ ఇక్కడి సంస్కృతిని తెలియచేస్తాం. హైదరాబాదీ అథెంటిక్‌ ఫుడ్‌ తినిపిస్తాం. ఫొటో, హెరిటేజ్‌ వాక్‌లు, ఫుడ్‌ టూర్స్‌కి వీలైనంత ఎక్కువగా నగరాన్ని, నగరవాసులని దగ్గరగా తెలుసుకునే విధంగా మా సర్వీసులుంటాయ’న్నారు నాగార్జునరెడ్డి. మరిన్ని వివరాలకు ‘అస్లి హైదరాబాద్‌’ ఫేస్‌బుక్‌ పేజ్‌ని చూడవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement