
సాక్షి, హైదరాబాద్: మంత్రివర్గంలో చోటు దక్కలేదన్న బాధ తనకు ఏమాత్రం లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టం చేశారు. మంత్రి పదవి రాలేదని తాను అసంతృప్తితో ఉన్నట్లు, పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. మంగళవారం రాజ్‌భవన్‌లో జరిగిన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. కొత్తగా ఎన్నికైన తెలంగాణ మంత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధే ద్యేయంగా కొత్త మంత్రులు కేసీఆర్ దిశా నిర్దేశంలో కలసికట్టుగా పనిచేయాలని సూచించారు. కేసీఆర్ ఏ బాధ్యత అప్పగించినా సామాన్య కార్యకర్తగా, క్రమశిక్షణ గల నాయకుడిగా పనిచేస్తానని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తనపైన వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment