హరీష్రావు సభామర్యాదలు నేర్చుకోవాలి: జీవన్రెడ్డి | harish rao should learn rules of house, says jeevan reddy | Sakshi
Sakshi News home page

హరీష్రావు సభామర్యాదలు నేర్చుకోవాలి: జీవన్రెడ్డి

Published Mon, Nov 10 2014 6:35 PM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM

హరీష్రావు సభామర్యాదలు నేర్చుకోవాలి: జీవన్రెడ్డి - Sakshi

హరీష్రావు సభామర్యాదలు నేర్చుకోవాలి: జీవన్రెడ్డి

మంత్రిగా ఉన్నందువల్ల హరీష్ రావు సభా మర్యాదలు నేర్చుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఈ నాలుగు నెలల్లోనే 400 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన గుర్తు చేశారు. ఒక్క మెదక్ జిల్లాలోనే 76 మంది రైతులు ప్రాణాలు తీసుకున్నా.. ఈ ఆత్మహత్యల అంశంపై మాత్రం ప్రభుత్వం బాధ్యత తీసుకోవట్లేదని ఆయన విమర్శించారు.

రైతు సమస్యలపై తెలంగాణ అసెంబ్లీలో సోమవారం సాయంత్రం తర్వాత జరిగిన చర్చలో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 7 గంటల పాటు విద్యుత్ అందించామని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి రాగానే మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్తు ఫైలు మీదే పెట్టారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు 4 గంటలకు మించి కరెంటు ఇవ్వట్లేదని, పంటలు ఎండిపోవడం వల్లనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని జీవన్రెడ్డి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement