తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన యదాద్రిలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది.
యాదగిరిగుట్ట (నల్లగొండ) : తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన యదాద్రిలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ధర్మదర్శనానికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ విపరీతంగా ఉండటంతో.. పోలీసులు కొండ పైకి వాహనాలను అనుమతించడం లేదు. కార్తీకమాసం కావడంతో సత్యనారాయణ వ్రతాలు నిర్వహించడానికి భక్తులు బారులు తీరారు.