
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ విస్తరణాధికారుల గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి సంబంధించి ఇంటర్ ఒకేషనల్ (క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్) పూర్తి చేసిన వారిని అర్హులుగా పరిగణించాలని వచ్చిన వినతులపై తగిన నిర్ణయం తీసు కోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీనిపై రెండు నెల ల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు తాత్కా లిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీ జే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ మంతోజ్ గంగారావుల ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.
విస్తరణాధికారుల గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి బీఎస్‌సీ(ఏజీ) పూర్తి చేసిన అభ్యర్థులను అర్హులుగా పరిగణి స్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇంటర్ ఒకేషనల్ (క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్‌మెం ట్) కోర్సు పూర్తి చేసినవారు తమను కూడా అర్హులుగా పరిగ ణించాలంటూ ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించారు. దీనిపై ప్రభుత్వం స్పందించక పోవడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం.. పిటిషనర్ల వినతిపత్రాలను పరిగణనలోకి తీసుకుని, రెండు నెలల్లో నిర్ణయం వెలువరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment