
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న ఆర్‌ఎంపీ (రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్లు), పీఎంపీ(ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్లు)ల.. పేర్లకు ముందు డాక్టర్ పెట్టుకుని రెగ్యులర్ డాక్టర్లుగా చెలామణి అవుతుండటంపై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. ఆర్‌ఎంపీలు, పీఎంపీలు పేరుకు ముందు డాక్టర్ ఉపయోగించడం చట్ట నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. ఈ విషయంలో వైఖరేమిటో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర వైద్య మండలి, రాష్ట్ర పారా మెడికల్ బోర్డు, ఔషధ నియంత్రణ మండలి, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలకు నోటీసులు జారీ చేసింది.
విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అభినంద్ కుమార్ షావిలిల ధర్మాసనం ఉత్త ర్వులు జారీ చేసింది. ఆర్‌ఎంపీలు, పీఎంపీలు అందిస్తున్న ప్రాథమిక వైద్య సేవలను మాత్రం తప్పుపట్టలేమని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment