కొల్లాపూర్ : కొల్లాపూర్ పట్టణంలో పేదలకు 500 పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. ఇందులో వికలాంగులు, అనాథలకు కేటాయించేందుకు ప్రాధాన్యమిస్తామన్నారు. కలెక్టర్‌ను తీసుకొచ్చి ఇళ్లనిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. మంగళవారం ఆయన కొల్లాపూర్‌లో పర్యటించి.. అమరగిరికి వెళ్లే దారిలో ఉన్న భూమిని పరిశీలించారు. ఇక్కడ ఐదొందల మందికి పక్కాఇళ్లు నిర్మించేలా లేఅవుట్‌ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. జమ్మిచెట్టు వద్ద ఉన్న జైలుఖానా ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ నగర పంచాయతీ కార్యాలయం, తహశీల్దార్ కార్యాలయ భవనాలను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
సోమశిలలోని రక్షత మంచినీటి పథకాన్ని పరిశీలించి నీటి పంపింగ్ కోసం వంద హెచ్‌పీ మోటార్, 30హెచ్‌పీ మోటార్‌ను ఏర్పాటుచేయాలని పంచాయతీ కమిషనర్‌కు సూచించారు. అనంతరం గోపాల్‌దిన్నె రక్షిత మంచినీటి పథకాన్ని పరిశీలించారు. ఆయన వెంట వీపనగండ్ల మండలం పెద్దదగడ గ్రామంలో ఇటీవల మరణించిన టీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు కుర్మయ్య కుటుంబాన్ని పరామర్శించారు. మృతుడి కూతుళ్లకు చదువులకయ్యే ఖర్చులను తాను భరిస్తానని మృతుడి భార్య చిట్టెమ్మకు భరోసా ఇచ్చారు. ఎంపీపీ నిరంజన్‌రావు, టీఆర్‌ఎస్ నాయకులు జూపల్లి రామారావు, ఖాదర్, మేకల రాముడుయాదవ్, సంపంగి నర్సింహ్మ, బోరెల్లి మహేష్ మాజీ జెడ్పీటీసీ కృష్ణప్రసాద్‌యాదవ్, పాన్‌గల్ సింగిల్‌విండో చైర్మన్ బాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
పేదలకు పక్కాఇళ్లు
Published Wed, Aug 12 2015 12:30 AM | Last Updated on Sun, Sep 3 2017 7:14 AM
Advertisement