
కేసీఆర్ ను ఎన్నిసార్లు ఉరి తీయాలి?: ఎర్రబెల్లి
ఇంతమంది రైతుల ఆత్మహత్యకు కారణమైన కేసీఆర్ ను ఎన్నిసార్లు ఉరి తీయాలని ఎర్రబెల్లి ప్రశ్నించారు.
హైదరాబాద్: రైతు ఆత్మహత్యలన్నీ తెలంగాణ ప్రభుత్వం చేసిన హత్యలేనని టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు పేర్కొన్నారు. రైతులకు టీడీపీ అండగా ఉంటుందని, అన్నదాతలు ధైర్యంగా ఉండాలని అన్నారు. ప్రభుత్వానికి దమ్ముంటే రైతు ఆత్మహత్యలపై అసెంబ్లీలో టీడీపీ సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ ఫాంహౌస్ చుట్టూ 24 గంటలు కరెంట్ ఇచ్చి రాష్ట్ర రైతాంగానికి కనీసం 2 గంటలు కూడా కరెంట్ ఇవ్వకపోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. కేసీఆర్ బిడ్డ గురించి ప్రశ్నించినందుకే తమను అసెంబ్లీ నుంచి గెంటేశారని వాపోయారు. మరి ఇంతమంది రైతుల ఆత్మహత్యకు కారణమైన కేసీఆర్ ను ఎన్నిసార్లు ఉరి తీయాలని ఎర్రబెల్లి ప్రశ్నించారు.