
రైతు ఆత్మహత్యలతో మనకు తలవంపులు
రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, రుతుపవనాల వైఫల్యం, రైతు ఆత్మహత్యలపై పూర్తిస్థాయి చర్చ జరగాలని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. అందరినీ కలవరపరుస్తున్న రైతుల ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు. రైతుకు భరోసా కల్పిస్తే రాష్ట్రం బాగుపడుతుందని ఆయన చెప్పారు. ఇంకా ఏమన్నారంటే..
- ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఎక్కడా లేని విధంగా జరుగుతున్నాయి.
- దేశమంతా మనవైపే చూస్తోంది
- రైతు ఆత్మహత్యలు మనకు తలవంపులు తెస్తున్నాయి
- ప్రభుత్వం దాన్ని తీవ్రంగా పరిగణించాలి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటో చెప్పాలి
- సమైక్య రాష్ట్రంలో, పరాయి పాలనలో సాగునీటి ప్రాజెక్టుల వల్ల రైతులకు మేలు జరగలేదు
- బావులు, బోరుబావులపై ఆధారపడే తెలంగాణ రైతుల సాగు
- మన ప్రభుత్వం మనకొస్తే సాగునీరు, తాగునీరు కల్పిస్తామని చెప్పారు
- కానీ రుతుపవనాల వైఫల్యం తర్వాత తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకపోవడం వల్లే కరువు వచ్చింది
- అందుకే వర్షాభావంతో రైతులు ఎనలేని కష్టాలు పడుతూ, అప్పులు తీర్చలేక, వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి
- ప్రభుత్వం వైపు నుంచి కూడా తగు చర్యలు తీసుకోవాలి
- రుణమాఫీ విషయంలో ఒకడుగు ముందుకేసి 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామని, లక్ష బాకీ తీరుస్తామని చెప్పారు
- కరువు మండలాలు ప్రకటిస్తే రైతు రుణాల వాయిదాల్లో చెల్లించే అవకాశం ఉంటుంది
- కూలీలకు కూడా పనిదినాలు పెంచే అవకాశం ఉంటుంది
- తాగునీరు కూడా లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు
- పశుగ్రాసం లేక పశువులను కబేళాలకు తరలిస్తున్నారు
- ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం ఆశాజనకంగా లేవు
- రైతులు తెలిసో, తెలియకో బోరుబావులు తవ్వి, వాటిలో నీళ్లు పడక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
- వాల్టా చట్టానికి అనుగుణంగా బోరుబావులకు అవకాశం ఉన్నచోటే తవ్వించాలి
- రుణమాఫీ విషయంలో, ఎన్నికలకు ముందు రైతులకు లక్ష రూపాయల రుణం మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు
- కానీ 23వేల కోట్లకు పైగా అవసరం అనుకుంటే దాన్ని 17వేల కోట్లకు కుదించారు
- దాన్ని కూడా వాయిదాల పద్ధతిలో చెల్లించడం వల్ల రైతులకు మేలు జరగడంలేదు
- ప్రభుత్వం ముందుకొచ్చి మిగిలిన 50 శాతం రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలి
- చెరుకు రైతుల బకాయిల అంశాన్ని కూడా చాలా సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి తెచ్చాం
- దాదాపు 1400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు లెక్కలు చెబుతుంటే, ప్రభుత్వం మాత్రం ఆ సంఖ్యను తగ్గించాలని చూస్తోంది
- అమరవీరుల విషయంలో కూడా 1100 మంది చనిపోతే 600 మందికి మాత్రమే పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పింది.
- చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు చేయడం కాకుండా, ముందే ప్రభుత్వం మేల్కోవాలి
- వరి, మొక్కజొన్నకు 500 అదనపు మద్దతుధర ప్రకటించాలి
- చేనేత కార్మికుల పరిస్థితి కూడా దారుణంగా ఉంది
- సిరిసిల్ల ప్రాంతంలో చేనేత కార్మికులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి, రైతులకు ప్రకటించే పరిహారాన్ని చేనేత కార్మికులకూ వర్తింపజేయాలి
- పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి