ఏడడుగులు నడిచి కడదాకా తోడుంటానని ప్రమాణం చేసి కట్టుకున్న భర్తే భార్యను కడతేర్చాడు. నిండుచూలాలని చూడకుండా కర్కశంగా గొంతుకోసేశాడు. ఈ ఘటనను చూసిన మూడేళ్ల కూతురినీ తుదముట్టించేందుకు ఒడిగట్టాడు. ఈ ఘోర సంఘటన మండల పరిధిలోని షాద్‌నగర్ మున్సిపాలిటీ చటాన్‌పల్లి శివారులో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
- న్యూస్‌లైన్, షాద్‌నగర్ రూరల్
తాగినమైకంలో కట్టుకున్న భార్య ను గొంతుకోసి హత్యసేశాడు ఓ భర్త. అంతటితో ఆగక తన చిన్నారి కూతురుపైనా దాడి చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. కేశంపేట మండలం వేముల్‌నర్వ గ్రామానికి చెందిన తిరుపతమ్మ(25)ను అదే మండలం తులవానిగడ్డ గ్రామానికి చెందిన ఓడ్సు వెంకటేష్‌కు ఇచ్చి ఏడేళ్ల క్రితం వివాహం జరిపించా రు. వీరికి శ్రీజ(3)ఉంది. కొంతకాలంగా వెంకటేష్ తాగుడుకు బానిసై భార్యతో తరచూ గొడవపడేవాడు. ఏదాడి క్రితం చటాన్‌పల్లి శివారులోని రాంనగర్ కాలనీ లో ఇల్లు నిర్మించుకొని అక్కడే నివాసం ఉంటున్నారు. కాగా మంగళవారం రాత్రి వెంకటేశ్ తాగి వచ్చాడు. ఇంటి ఆవరణ లో నిద్రపోయూరు. తెల్లవారుజామున ఇరువురు గొడవ పడ్డారు.
కోపోద్రిక్తుడైన వెంకటేష్ తాగినమైకంలో ఎనిమిది నెలల గర్భిణి అనికూడా చూడకుండా మారణాయుధంతో భార్య తిరుపతమ్మ గొంతుకోసి కడతేర్చాడు. ఈ అలికిడికి పక్కనే నిద్రిస్తున్న కూతురు శ్రీజ నిద్రమేల్కొనడంతో విషయం ఎవరికైనా చెబుతుందేమోనని చిన్నారిపైనా దాడి చేయగా కేకలేస్తూ బయటకు పరుగులు తీసి అదే కాలనీలో నివాసముంటున్న వెంకటేష్ అన్న ఓడ్సు స్వామికి విషయాన్ని చెప్పిం ది.
స్వామి ఫోన్ ద్వారా తిరుపతమ్మ కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందిచారు. తీవ్రంగా గాయపడిన శ్రీజను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. పట్టణ సీఐ నిర్మల సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించా రు. నిందితుడిని అదుపులోకి తీసుకొని తిరుపతమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి గొలుసు అనంతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి ద ర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ నిర్మల తెలిపారు.
భార్యను కడతేర్చిన భర్త
Published Wed, May 28 2014 2:34 AM | Last Updated on Sat, Sep 2 2017 7:56 AM
Advertisement
Advertisement