
శంషాబాద్ వరకు మెట్రోరైలు: కేసీఆర్
హైదరాబాద్: మెట్రోరైలు నిర్మాణ పనుల పురోగతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ వాసులకే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చువారికీ ఉపయోగపడేలా మెట్రోరైలు ఉండాలని ఆయన అభిలషించారు. మెట్రో రైలు పనులపై మంత్రులు, ఉన్నతాధికారులతో మంగళవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఫలక్ నుమా, రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రోరైలు అవసరముందని అన్నారు. ఢిల్లీ తరహా భద్రతా వ్యవస్థ హైదరాబాద్ మెట్రోరైలుకు కల్పించాలన్నారు. మెట్రోరైలుకు విద్యుత్ సబ్సిడీ అందించేందుకు కేసీఆర్ అంగీకరించారు. ఎల్ అండ్ టీ సీఈవో వీఎన్ గాడ్గిల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.