చెరువుల మట్టి తరలిపోతోంది..
► వ్యాపారుల మాయజాలం
► పట్టించుకోని అధికారులు
► ప్రభుత్వ ఆదాయానికి గండి.3
తిమ్మాపూర్ : మిషన్ కాకతీయ కింద చేపడుతున్న చెరువుల్లో మట్టి వ్యాపార అవసరాలకు తరలిపోతోంది. చెరువులను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌కాకతీయ వ్యాపారులకు వరంగా మారింది. చెరువులో నల్లమట్టిని రైతులు పంట పొలాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం వీ లు కల్పించింది. కాంట్రాక్టర్ చెరువులో నల్లమట్టిని ట్రా క్టర్లలో ఉచితంగా లోడింగ్ చేస్తే.. రైతు ట్రాక్టర్‌ను ఏర్పా టు చేసుకుని తరలించుకోవాలనేది నిబంధన. అయితే పలు గ్రామాల్లో నిబంధనలు పాటించకుండా నల్లమట్టిని వ్యాపారులు అక్రమంగా తరలించుకుంటున్నారు.
ఎల్‌ఎండీ పోలీసులు రామకృష్ణకాలనీలో దత్తత తీసుకున్న అబ్బిరెడ్డికుంట చెరువులో పూడికతీతను శనివారమే ప్రారంభించగా.. వెంటనే స్థానికంగా ఉన్న ఇటుక బట్టీలకు తరలించారు. ఆ చెరువులోని నల్లమట్టిని చెరువుకు ఎదురుగా ఉన్న గేటెడ్ కమ్యునిటీహాల్ పరిధిలో నిర్మిస్తున్న ఇళ్ల పునాదుల్లోకి తరలిస్తున్నారు. మట్టి కావాల్సిన రైతులు చేతుల్లో డబ్బుల్లేక పలు ట్రాక్టర్ల యజమానులతో మాట్లాడుకుని పదుల సంఖ్యలోనే మట్టిని తరలించుకుంటున్నారు. అయితే వ్యాపారులు ట్రాక్టర్లకు అద్దె ఎక్కువ చెల్లిస్తుండడంతో అంతే మొత్తాన్ని తమను చెల్లించాలని ట్రాక్టర్ యజమానులు కోరుతున్నారని, దీంతో తమపై భారం పడుతుందని రైతులు వాపోతున్నారు. దూరం తక్కువున్నా ట్రాక్టర్ అద్దె ఎక్కువగా ఇస్తుండడంతో వ్యాపార ులకే మట్టి తరలించేందుకు ట్రాక్టర్ యజమానులు ముందుకు వస్తున్నారు.
పోరండ్ల, నల్లగొండలో..
పోరండ్ల గ్రామ పరిధిలో నాలుగు ఇటుక బట్టీలు ఉండగా అన్నీ బట్టీలలో నల్లమట్టి వేల ట్రిప్పుల్లో ఉంది. అక్కడ గతేడాది కేవలం రెండు బట్టీలు గ్రామ పంచాయతీ వేలంలో మట్టిని కొనుగోలు చేయగా, మిగతా రెండు బట్టీల్లోకి మట్టి ఎలా తరలిందనే విషయం ప్రశ్నార్థకమైంది. మానకొండూర్ మండలం గంగిపెల్లి నుంచి ఇటుక బట్టీలకు మిషన్‌కాకతీయ కింద కాంట్రాక్టర్ జేసీబీని ఏర్పాటు చేయగా ట్రాక్టర్లతో చెరువుల్లో నల్లమట్టి తరలించారు. నల్లగొండ పరిధిలోని ఇటుక బట్టీలకు మిషన్‌కాకతీయ కింద చెరువుల్లో మట్టిని తరలించారు.
జేసీబీకి ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తున్నప్పుడు మట్టిని వ్యాపార అవసరాలకు ఎలా వినియోగిస్తున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇరిగేషన్ శాఖ అనుమతి తీసుకుని గ్రామ పంచాయతీలో వేలం వేసి నల్లమట్టిని తీసుకోవాల్సి ఉండగా ఇవేమీ పట్టించుకోకుండా ఇటుక బట్టీలకు, గృహ నిర్మాణాలకు వ్యాపారులు తరరలించుకుంటున్నారు. ఇవన్నీ తెలిసినా అటు రెవెన్యూ, ఇటు ఇరిగేషన్‌బోర్డు అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికైనా ఇటుక బట్టీలకు మట్టి ఎలా వచ్చిందని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఆరా తీస్తే ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టకుండా కాపాడాలని రైతులు కోరుతున్నారు.