ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, మేడ్చల్ : జిల్లాలోని నాగారం సమీపంలోని శిల్పనగర్‌లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చంది. వృధాశ్రమం పేరుతో అక్రమంగా సైకియాట్రిక్ పునరావాస కేంద్రాన్ని నడపుతూ.. వృద్ధులను చిత్రహింసలకు గురి చేస్తున్న వైనం ఆలస్యంగా బయటపడింది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు సంబంధిత నిర్వాహకులకు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. మల్కాజిగిరి డిసీపీ రక్షిత మూర్తి, ఏసీపీ శివకుమార్ బాధితులను నుంచి సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు.
బాధితులు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం గత కొంతకాలం నుంచి శిల్పనగర్‌లో పలువురు వృద్ధాశ్రమం నడుపుతున్నారు. అయితే తెరవెనుక మాత్రం జరిగే తంతు వేరు. మానసికంగా సరిగా లేని వారిని బాగుచేస్తాం అని చెప్పి, లక్షల్లో డబ్బులు వస్తూలు చేస్తున్నారు. అంతేకాదు బాధితులకు నరకయాతన చూపిస్తూ తీవ్ర వేధింపులకు గురిస్తున్నారు. చెప్పిన మాట వినకుంటే శరీరంపై నిప్పుతో కాల్చటం లాంటి పైశాచిక చర్యలకు పాల్పడేవారని బాధితులు ఆవేదన ఆరోపిస్తున్నారు. పది నుంచి పదిహేను మంది ఉండాల్సిన గదిలో 50 మందిని నిర్బంధిస్తున్నారని గోడు వెళ్లబోసుకున్నారు.
మరోవైపు ఈ అక్రమ ఆశ్రమంలో యువత కుడా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. బరువు తగ్గడం కోసం వచ్చిన వారిని తిండి పెట్టకుండా నరకం చూపిస్తారని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్వాహకులను ఎదురు తిరిగి ప్రశ్నిస్తే గోలుసులతో కట్టి వేస్తారని బాధితుల మాటలో స్పష్టం అవుతోంది. దీనిపై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. బాధితులకు మెడికల్ పరీక్షల అనంతరం సంబంధిత కేంద్రాలకు తరలించే పనిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment