నందీశ్వర్ షికారు
నేడు టీఆర్‌ఎస్‌లోచేరేందుకు నిర్ణయం
తొలి జాబితాలోనే చోటు కల్పించనున్న గులాబీబాస్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:పటాన్‌చెరు ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ ‘కారు’ఎక్కేందుకే సిద్ధమైపోయినట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్టు జరిగితే ఆదివారం మధ్యాహ్నం ఆయన కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకుంటారని, అదేరోజు, లేదా ఆ మరుసటి రోజు కేసీఆర్ విడుదల చేసే తొలివిడత అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో నందీశ్వర్ పేరును ప్రకటిస్తారని విశ్వసనీయంగా తెలిసింది.
వేధించారు..అందుకే పోతున్నా
రాజకీయ గురువు డి.శ్రీనివాస్‌తో పాటు, రాహుల్‌గాంధీ దూత ఒకరు నందీశ్వర్‌గౌడ్‌కు ఫోన్ చేసి పార్టీ వదిలి వెళ్లొద్దని వారించినా.. ఆయన మెత్తబడనట్టు సమాచారం. అగ్రకుల సామాజిక వర్గానికి చెందిన కొందరు కాంగ్రెస్ పెద్దలు....జిల్లాలో ఉన్న ఏకైక బీసీ ఎమ్మెల్యేనైన ఠమొదటిపేజీ తరువాయి
తనను మానసిక వేధింపులకు గురి చేస్తున్నారని రాహుల్ దూతతో నందీశ్వర్ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇంతగా ఇబ్బంది పెట్టిన తర్వాత కూడా కాంగ్రెస్‌లో కొనసాగితే తన రాజకీయ మనుగడకే ఇబ్బంది ఏర్పడే ప్రమాదం ఉందని బాధపడ్డట్లు తెలిసింది. శుక్రవారం మధ్యాహ్నం జగదేవ్‌పూర్‌లోని ఫాంహౌస్‌లో కేసీఆర్‌ను కలిసిన నందీశ్వర్..అనంతరం కార్యకర్తలు, శ్రేయోభిలాషులతో వేర్వేరుగా చర్చలు జరుపుతూ వచ్చారు. ఎక్కువ మంది కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లోకి వెళ్లడమే మంచిదని సూచించినట్లు తెలిసింది.
అయితే ప్రస్తుతం జిల్లాలో ఏకైక బీసీ ఎమ్మెల్యేగా ఉన్న నందీశ్వర్ ఈ పర్యాయం గెలిస్తే దాదాపు మంత్రి పదవి ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమైన ఆయనకు సన్నిహితులు కూడా సలహాలిస్తున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీల వర్గాల నుంచి మంత్రి పదవి అడగాలని వారంతా ఆయనకు సూచించినట్లు సమాచారం. ఈ పరిమాణాలపై నందీశ్వర్‌గౌడ్‌ను వివరణ కోరేందుకు సాక్షి ప్రతినిధి ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు