ప్రధాని స్ఫూర్తితో ముందుకు | Inspired by the Prime Minister ahead of the | Sakshi
Sakshi News home page

ప్రధాని స్ఫూర్తితో ముందుకు

Published Fri, Oct 10 2014 12:28 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

ప్రధాని స్ఫూర్తితో ముందుకు - Sakshi

ప్రధాని స్ఫూర్తితో ముందుకు

బోడుప్పల్: ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తితో పరిశుభ్రమైన దేశంగా తీర్చిదిద్దేందుకు ముందుకు వెళ్దామని గోవాగర్నర్ మృదుల సిన్హా పేర్కొన్నారు.  మేడిపల్లిలోని మేకల బాల్‌రెడ్డి పంక్షన్ హాల్‌లో గురువారం జరిగిన సాధీ సౌత్ రీజనల్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిశుభ్రం, ఆరోగ్యం, అభివృద్ధిలో మిగతా దేశాలకు దీటుగా నిలవాలన్నారు. రానున్న పదేళ్లలో ప్రపంచ దేశాలు భారత దేశాన్ని ఆదర్శంగా చెప్పుకునే స్థాయికి ఎదగాలన్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ సాధీ నెట్ వర్క్ సేవలు మరింత విస్తరించాలని ఆయన సూచించారు. చేర్యాల మాజీ ఎమ్మెల్యే కొమ్మూరు ప్రతాప్‌రెడ్డి, తెలంగాణ కోఆర్డినేటర్ శాడకొండ శ్రీకాంత్‌రెడ్డి, జహీదబేగంతో పాలు పలువురికి సాధీ సేవా పురస్కార అవార్డులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో సాధీ సౌత్ ఇన్‌చార్జ్ మంకన శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ ఆర్‌బి సిన్హా, సాధీ నెట్ వర్క్ స్వచ్ఛంధ సంస్థ అధ్యక్షురాలు మోహినిగార్గ్, ఏపీ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మల్లారెడ్డి, కర్ణాటక ఇన్‌చార్జ్ కరుణాకర్, సింగరేస్ కాలరీస్ డెరైక్టర్ విజయకుమార్, శ్రీకాంత్‌రెడ్డి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement