సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) అధ్యక్ష పదవి రేసులో తానూ ఉన్నానని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. సీఎం పదవిని ఆశించకుండా తాను పనిచేస్తానని, ఈ విషయం చెప్పేందుకు ఈనెల 17న ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు కీలక నేతలు రాహుల్, అహ్మద్‌పటేల్, కె.సి.వేణుగోపాల్‌తో పాటు తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్.సి.కుంతియాను కలుస్తానని చెప్పారు. అసెంబ్లీ ప్రాంగణంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్షుడి మార్పు ఉంటుందని ఢిల్లీ నుంచి వార్తలొస్తున్నాయని, అదే నిజమైతే మున్సిపల్ ఎన్నికల తర్వాత మార్చాలని తాను అధిష్టానాన్ని కోరతానని తెలిపారు. .
Comments
Please login to add a commentAdd a comment