కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల ధర్నా | Journalists protest in front of collecterate | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల ధర్నా

Published Mon, Dec 28 2015 1:59 PM | Last Updated on Sun, Sep 3 2017 2:42 PM

Journalists protest in front of collecterate

జర్నలిస్టులందరికి హెల్త్ కార్డులు, అక్రిడేషన్ కార్డులు తక్షణమే అందించాలని కోరుతూ.. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో టీయూడబ్ల్యూజే అధ్యక్షులు నగునూరి శేఖర్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కరుణాకర్, శ్రీనివాస్‌తో పాటు పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు. జర్నలిస్టుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే అసెంబ్లీ సమావేశాల సమయంలో చలో అసెంబ్లీ చేపడుతామని హెచ్చరించారు. జర్నలిస్టుల ధర్నాకు వైఎస్సార్సీపీ మద్దతు ప్రకటించి ధర్నాలో జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు పలు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement