కాళోజీ హెల్త్‌వర్సిటీకి పాలకమండలి | Kaloji health of the governing body of the university | Sakshi
Sakshi News home page

కాళోజీ హెల్త్‌వర్సిటీకి పాలకమండలి

Published Tue, Dec 29 2015 1:39 AM | Last Updated on Tue, Oct 30 2018 7:57 PM

Kaloji health of the governing body of the university

 వరంగల్ : కాళోజీ యూనివర్సిటీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. యూనివర్సిటీకి ఏడుగురు సభ్యులతో పాలక మండలిని ఏర్పాటు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2014 సెప్టెంబర్ 25న కాళోజీ యూనివర్సిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ పరిపాలనకు సంబంధించిన కార్యక్రమాలు మాత్రం మొదలుకాలేదు. వచ్చే విద్యా సంవత్సరంలో అయినా ఈ వర్సిటీ కార్యక్రమాలు నిర్వహిస్తుందా లేదా అనే విషయంలో స్పష్టత రావడం లేదు. ఈ అంశంపై ‘ఖాళీగా కాళోజీ వర్సిటీ’ శీర్షికతో ఈ నెల 27వ తేదీన ‘సాక్షి’ ప్రధాన  సంచికలో కథనం ప్రచురితమైంది. స్పం దించిన ప్రభుత్వం కాళోజీ వైద్య విశ్వవిద్యాలయానికి పాలక మండలిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విశ్వవిద్యాలయం కార్యకలాపాలలో పాలక మండలి కీలకమైనది. యూ నివర్సిటీ పరిపాలన, ఉద్యోగుల భర్తీ, అభివృద్ధి కార్యక్రమాలన్నింటికీ పాలకమండలి ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది.

పాలక మండలిలోని సభ్యులు వీరే...
{పొఫెసర్ డాక్టర్ కె.శ్రీనాథ్‌రెడ్డి - పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా(పీహెచ్‌ఎఫ్‌ఐ) అధ్యక్షుడు
{పొఫెసర్ డాక్టర్ డి.రాజారెడ్డి - నిమ్స్ మాజీ సంచాలకుడు
{పొఫెసర్ డాక్టర్ పి.శ్రీనివాస్ - వైద్య విద్యా శాఖ మాజీ సంచాలకుడు
డాక్టర్ మంతా శ్రీనివాస్ - అనస్తీషియా ప్రొఫెసర్
డాక్టర్ కె.ఇందిర - ఫార్మకాలజీ ప్రొఫెసర్, నిజామాబాద్ వైద్య కళాశాల.
డాక్టర్ జె.పాండురంగ్ - ఆప్తమాలజీ ప్రొఫెసర్, కాకతీయ వైద్య కళాశాల.
డాక్టర్ బి.రమేష్ - రేడియాలజీ ప్రొఫెసర్, ప్రతిమ వైద్య కళాశాల, కరీంనగర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement