సాక్షి,హైదరాబాద్: ‘కల్యాణలక్ష్మి’ కింద ప్రభుత్వ ఆర్థికసహాయం అందాలంటే పెళ్లికి దాదాపు నెల రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ సంక్షేమ శాఖ డెరైక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. పెళ్లికూతురు బ్యాంకు అకౌంట్‌లో రూ.51 వేలను జమచేస్తారని ఆయన చెప్పారు.
ఈ అవకాశాన్ని పెళ్లిచేసుకోబోయే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువతులు ఉపయోగించుకోవాలని సూచించారు. వివరాలకు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ, ఐటీడీఏ, మైనారిటీ సంక్షేమశాఖ అధికారులను సంప్రదించాలని పేర్కొన్నారు.
నెల ముందే ‘కల్యాణలక్ష్మి’కి దరఖాస్తు
Published Thu, Feb 12 2015 3:23 AM | Last Updated on Tue, Oct 30 2018 8:01 PM
Advertisement
Advertisement