తైవాన్‌కు కేటీఆర్... కవిత దుబాయికి...
హైదరాబాద్: రెండు రోజుల పర్యటనకు మంత్రి కేటీఆర్ బుధవారం రాత్రి తైవాన్‌కు బయల్దేరి వెళ్లారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించేందుకు తైవాన్‌లోని ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల ప్రతినిధులతో ఆయన సమావేశమవుతారు. అక్కడ ఏర్పాటు చేసిన ఇండియా-తైవాన్ బిజినెస్ కో-ఆపరేటివ్ ఫోరం సమావేశంలో కేటీఆర్ పాల్గొంటారు.
అంతర్జాతీయ కంప్యూటెక్స్-2015 ఎగ్జిబిషన్ తిలకిస్తారు. అలాగే, దుబాయ్, అబుదాబిలో గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 5వ తేదీన నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు నిజామాబాద్ ఎంపీ కవిత హాజరు కానున్నారు. దుబాయ్‌లో ఉదయం 9 గంటలకు, అబుదాబిలో సాయంత్రం 5 గంటలకు ఉత్సవాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.