2009-14 మధ్య ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఆర్థిక సాయం ప్రకటించారు.
హైదరాబాద్: తెలంగాణలో 2009-14 మధ్య ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఆర్థిక సాయం ప్రకటించారు. 404 కోట్ల రూపాయిల ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
75.84 కోట్ల రూపాయిల తక్షణ సాయం అందజేయాలని కేసీఆర్ ఆదేశించారు. రైతుల ఖాతాల్లోకే సబ్సిడీ జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.