సాక్షి, మెదక్: టీఆర్‌ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 21న మెదక్‌కు రానున్నారు. మెదక్‌లోని సీఎస్‌ఐ చర్చి కాంపౌండ్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు కేసీఆర్ హాజరై ప్రసంగించనున్నారు. సుమారు 30వేల మందితో బహిరంగ సభ నిర్వహించేందుకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి సన్నాహాలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హాజరయ్యే బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.
నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుండి జన సమీకరణ జరిగేలా చూస్తున్నారు. బహిరంగ సభ నిర్వహణకోసం అవసరమైన అన్ని అనుమతులను తీసుకోవాల్సిందిగా నియోజకవర్గ నాయకులకు సూచించారు. బహిరంగ సభ ఏర్పాట్లపై శుక్రవారం సాయంత్రం మెదక్‌లోని తన కార్యాలయంలో పార్టీ నాయకులతో పద్మాదేవేందర్‌రెడ్డి సమావేశమయ్యారు. సభ విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు దేవేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్‌చైర్మన్ రాగి అశోక్, టీఆర్‌ఎస్ నాయకులు లింగారెడ్డి, శ్రీనివాస్, ముత్యంగౌడ్, జీవన్‌రావు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment