
ఎస్సీ వర్గీకరణపై కేసీఆర్ మాట్లాడాలి..
వరంగల్‌సిటీ : ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన మనసులోని మాటను బయటపెట్టాలని మహాజన సోషలిస్టు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. కాశిబుగ్గలోని అంబేద్కర్‌భవన్‌లో సోమవా రం ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండు రాష్ట్రా లు ఏర్పడకముందు చంద్రబాబునాయుడు ఎస్సీ వర్గీకరణపై సానుకూలంగా స్పందించారని, ప్రస్తుతం ఆయన మౌనంగా ఉండడం సరైనది కాదన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం ఎస్సీ వర్గీకరణపై స్ప ష్టమైన వైఖరిని ప్రకటించాలన్నారు. ఇరు రాష్ట్రాల సీఎంలు చొరవ చూపితే వర్గీకరణ అమలయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు.
ఎస్సీ వర్గీకరణపై ఇరు రాష్ట్రా ల ముఖ్యమంత్రులు తమ అభిప్రాయాలు వెల్లడించకుంటే పోరాటాలు చేస్తామన్నారు. ఈనెల 19న తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇంటింటి సామాజిక సర్వేను ఒకరోజు కాకుండా వారం రోజుల పాటు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకరోజు లో రాష్ట్రమంతటా సర్వే నిర్వహించడం సాధ్యపడద ని, అనుకోకుండా ఆ రోజు కుటుంబ సభ్యులు ఇబ్బం దుల్లో ఉంటే కచ్చితమైన డేటా నమోదయ్యే అవకా శం ఉండదని వివరించారు.
పేదలకు రేషన్ కార్డుల విషయంలో అన్యాయం జరిగితే రాష్ట్రప్రభుత్వం కూలిపోతుందన్నారు టీఆర్‌ఎస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి అంశాన్నీ పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎంఆర్‌పీఎస్ నాయకులు మందకుమార్, తిప్పారపు లక్ష్మణ్, ఈర్ల కుమార్, తీగల ప్రదీప్, వేల్పుల వీరన్న, పుట్ట రవి, ఎర్ర విజయ్, బేతాళ్ల శివ, సిరిమల్ల వీరేందర్, ప్రమోద్, అనంత్, దేవన్న, చిరంజీవి, అబ్రహం, వీరుభాయ్, మహేష్ పాల్గొన్నారు.