చినుకు రాలలే! | Kharif loan of Rs .2760 million goal | Sakshi
Sakshi News home page

చినుకు రాలలే!

Published Thu, Jun 11 2015 4:20 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Kharif loan of Rs .2760 million goal

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఎండనకా, వాననకా, పగలనకా, రేయనకా ఆరుగాలం శ్రమించే రైతులే ఎప్పుడూ అన్యాయానికి గురవుతున్నారు. విత్తనాలు, ఎరువుల కొనుగోలు మొదలు ఉత్పత్తులను అమ్ముకునే వరకు ఇదే జరుగుతోంది. వ్యవసాయశాఖ అధికారుల అంచనాలు బాగానే ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రతికూల పరిస్థితులు రైతులను సతమతం చేస్తున్నాయి. ప్రతి సీజన్‌లోనూ వర్షాభావం, విత్తనాలు, ఎరువుల కొరత పరిపాటిగా మారుతోంది. 2013-14 ఖరీఫ్‌లో పంటల సాగు వ్యవసాయ శాఖ అంచనాలను మించి 110 శాతానికి చేరింది. వ్యాపారులు సిండికేట్‌గా మారి సోయా, పత్తి రైతులను దగా చేశారు.

2014-15 ఖరీఫ్‌లో సమస్య పునరావృత్తం కాకుండా చూడాలన్న రైతులు, రైతు సంఘాల డిమాండ్ మేరకు కార్యాచరణ ప్రణాళికలో వ్యవసాయ శాఖ మా ర్పులు చేసింది. గత ఖరీఫ్‌లో 3,12,782 హెక్టార్లలో దిగులు తప్పడం లేదు. వ్యవసాయశాఖ అధికారుల అంచనాలు బాగానే ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రతికూల పరిస్థితులు రైతులను సతమతం చేస్తున్నాయి. ప్రతి సీజన్‌లోనూ విత్తనాలు, ఎరువుల కొరత పరిపాటిగా మారుతోంది.

2013-14 ఖరీఫ్‌లో పంటల సాగు వ్యవసాయ శాఖ అంచనాలను మించి 110 శాతానికి చేరింది. వ్యాపారులు సిం డికేట్‌గా మారి సోయాబీన్, పత్తి రైతులను దగా చేశారు. 2014-15 ఖరీఫ్‌లో సమస్య పునరావృత్తం కాకుండా చూడాలన్న రైతులు, రై తు సంఘాల డిమాండ్ మేరకు కార్యాచరణ ప్రణాళికలో వ్యవసాయ శాఖ మార్పులు, చేర్పులు చేసింది. గత ఖరీఫ్‌లో 3,12,782 హెక్టార్లలో వివిధ పంటలు సాగు కాగా, ఈసారి 4,18,100 హెక్టార్లకు పెరుగుతుందని అంచనా వేశారు. ఈ మేరకు ఎరువులు, విత్తనాలను అందుబాటులోకి తేవాల్సి ఉండగా ఇప్పటికీ, ఈ దిశగా కసరత్తు జరగడం లేదని రైతులు వాపోతున్నారు.

 2015 ఖరీఫ్ వ్యవసాయ ప్రణాళిక ఇది
 2014 ఖరీఫ్‌లో రూపొందించిన వ్యవసాయ శాఖ కార్యాచరణ ప్రణాళిక పూర్తిగా తలకిందులయ్యింది. పది శాతం అధికంగా సాగు కాగా, 3,12,782 హెక్టార్లలో పంట లు వేశారు. ఈ నేపథ్యంలో సోయాబీన్ విత్తనాల కొరత ఏర్పడింది. ఈ ఖరీఫ్‌లో 4,18,100 హెక్టార్ల వివిధ పంటలు సాగు చేస్తారని అంచనా వేసిన అధికారులు ఇందు కోసం 1.40 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలు సరఫరా చేయాలని నిర్ణయించారు. అత్యధికంగా 1.50 లక్షల హెక్టార్లలో వరి, 1.50 లక్షల హెక్టార్లలో సోయా సాగు చేస్తారని నివేదిక పేర్కొంది. 55,000 హెక్టార్లలో మొక్కజొన్న, 15,000 హెక్టార్లలో పత్తి సాగు అవుతుందని అంచనా.

ఇందుకోసం 1,12,500 క్వింటాళ్ల సోయా, 11,000 క్విం టాళ్ల మొక్కజొన్న, 75,000 ప్యాకెట్ల అజిత్, మహికో, నూజివీడు, తులసి విత్తనాలు అవసరముంటుందన్నారు. ఏపీ సీడ్స్, హాకా, ఏపీ ఆయిల్‌ఫెడ్‌లతో పాటు ప్రాథమి క వ్యవసాయ సహకార సంఘాలు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు తదితర ప్రభుత్వరంగ సంస్థల ద్వారా రైతులకు విత్తనాలు సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రధానంగా 1,12,500 క్వింటాళ్ల సోయా విత్తనాలను మాత్రం హాకా, ఏపీ సీడ్స్, ఆయిల్‌ఫెడ్‌ల ద్వారా పంపిణీ చేయనున్నామన్నారు.

ఇదిలా వుంటే ఖరీఫ్ కోసం 1,32, 278 మెట్రిక్ టన్నుల యూరియా, 18,548 మె.టన్నుల డీఏపీ, 63,062 మె.టన్నుల కాంప్లెక్స్ 20,005 మె.టన్నుల ఎంఓపీ ఎరువులు కలిపి మొత్తం 2,34,303 మెట్రిక్ టన్నుల ఎరువుల సరఫరా చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. అయితే జూన్‌లో 67,925 మెట్రిక్ టన్నుల ఎరువులు మార్కెట్లో అందుబాటులో ఉండాల్సి ఉండగా, ఆ మేరకు సరఫరా కాలేదంటున్నారు.

 ఖరీఫ్ రుణ లక్ష్యం రూ.2760 కోట్లు
 20 15-16 ఖరీఫ్ రుణ లక్ష్యం రూ.2760 కోట్లుగా పేర్కొనగా, ఇప్పటి వరకు బ్యాంకర్లు చాలాచోట్ల రైతులకు రుణాలిచ్చే ప్రక్రియను ప్రారంభించ లేదు. తొలకరి జల్లు కురి స్తే చాలు దుక్కులు చదును చేయడంతోపాటు విత్తనాలు, ఎరువుల కోసం రైతులు పరుగులు పెడతారు. ఈలోగానే రైతులకు రుణాలు చేతికందితే ప్రయోజనకరంగా ఉ ంటుందన్న అభిప్రాయం ఉంది. శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు తదితర ప్రాజెక్టులు నీరులేక వెల వెల పోతుండగా, ఆయకట్టుదారులు వరుణుడిపైనే ఆశలు పె ట్టుకున్నారు.

గత ఖరీఫ్, రబీలో ప్రతికూల పరిస్థితులలో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఈ ఖరీఫైనా కలిసి వస్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో అధికారులు సరిపడే విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి తేవడంతోపాటు ఖరీఫ్ రుణాలను వెంటనే అందించేందుకు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement