సాక్షి, యాదగిరిగుట్ట: ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు పరిష్కారం చూపకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగి 11 రోజులు కావస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ మొండి వైఖరితో ఆర్టీసీ కార్మికులు ఆత్మబలిదానాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేసి ఆర్టీసీ ఆస్తులను దోచుకోవాలని కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలోనే పాల్గొనని నాయకులతో కార్మికులను రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment