సాక్షి, హైదరాబాద్ : కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకునేందుకు పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో ప్రజలెవరు బయటకి రావద్దని, ముఖానికి మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్‌లోని కంటైన్మెంట్ జోన్లలోని ప్రజల యోగక్షేమాలను స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటి వద్ద ఆగిన కేటీఆర్ ఆ కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న ఓ పిల్లాడిని ఏం పేరని అడగ్గా రామ్‌చరణ్ అని చెప్పాడు. దీంతో ‘నా రామ్ చరణ్ తెలుసా నీకు? సినిమాల్లో రామ్ చరణ్ తెలుసా..?'అని అనడంతో అక్కడున్న వారందరూ నవ్వారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మంత్రి కేటీఆర్, రామ్‌చరణ్ మంచి మిత్రులు అన్న విషయం తెలిసిందే.
చదవండి:
కేసీఆర్ తాత నిన్ను పాస్ చేసిండుపో..
‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత మహేశ్‌తోనే.. జక్కన్న క్లారిటీ
Comments
Please login to add a commentAdd a comment