హైదరాబాద్‌లో ఆతిథ్యమిచ్చే అన్ని వేదికల్లో ఆయన మాట్లాడుతారు. ఆంగ్ల భాష పటిమతో అందరిని మెప్పిస్తారు. తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్గా మారారు. ఆయనే కల్వకుంట్ల తారక రామారావు. కానీ పాపులర్ అయింది మాత్రం కేటీఆర్. తండ్రి కేసీఆర్ బాటలో నడవాలని ప్రయత్నిస్తుంటారు. అమెరికాలో చేస్తున్న ఉద్యోగం వదిలి తెలంగాణలో తండ్రికి అండగా నిలబడ్డారు. సినీనటుడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్పై ఉన్న అభిమానంతో కేసీఆర్ తన కుమారుడికి తారక రామారావు అని నామకరణం చేశారు. ఆయన ఇప్పుడు తెలంగాణలోని యువకులకు రోల్ మోడల్ అయ్యారు. తన మాటలతో పత్యర్థులపై అలవోకగా యుద్ధం చేయగల నేర్పరి. ప్రత్యర్థులపై సందర్భోచితంగా విమర్శలు సంధించడంలో దిట్ట. వాక్చాతుర్యమే కాదు.. హావభావాల ప్రదర్శించడంలోనూ తండ్రిని పోలినట్టే ఉంటుంది.
పరిపాలనలో తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ యాపిల్, ఐకియా, ఉబర్ లాంటి పేరున్న అంతర్జాతీయ సంస్థలను హైదరాబాద్‌కు వచ్చేలా చేసీ పెట్టుబడులను పట్టుకొస్తున్న బిజినెస్ మ్యాన్‌గా మారిపోయారు. తెలుగులోనే కాకుండా ఆంగ్లంలోనూ అనర్గళంగా మాట్లాడగలరు. వేదికలపైనుంచి మాట్లాడటమే కాకుండా అవతలి వారిని మెప్పించగల నేర్పరి. నేరుగా కలుసుకోవడానికి వచ్చే వారికి అందుబాటులో ఉండరేనే విమర్శ ఉన్నప్పటికి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పొలిటిషన్.
అమెరికాలొ ఉద్యోగం చేస్తున్న సమయంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ప్రత్యేక తెలంగాణ కోసం జరుగుతున్న ఆందోళనలు, ఆ బాటలో తండ్రి కేసీఆర్ నిమగ్నమైన సందర్భం... ఆయనను ఉద్యోగం చేయనివ్వలేదు. ఆ పరిస్థితులే కేటీఆర్‌ని 2005లో భారత్‌కు రప్పించాయని చెబుతుంటారు. యూపీఏ ప్రభుత్వానికి రాజీనామా చేయడంతో పాటు ఉపఎన్నికలను ఎదుర్కొనాల్సిన పరిస్థితుల్లో తండ్రికి మద్దతుగా నిలిచి అనుకోకుండా రాజకీయ అరంగ్రేటం చేశారు. 2009లో సిరిసిల్లా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి స్వల్ప మెజారిటీతో శాసనసభకు ఎన్నికయ్యారు. 2014 లో రెండోసారి గెలిచి కేసిఆర్ ప్రభుత్వంలో సమాచార సాంకేతిక (ఐటీ), మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, టెక్ట్సైల్స్ మరియు ఎన్నారై ఎఫైర్స్ మంత్రిగా పనిచేశారు
పేరు : కల్వకుంట్ల తారక రామరావు
పుట్టిన తేది : 1976, జూలై 24
రాజకీయ పార్టి : తెలంగాణ రాష్ట్ర సమితి
తల్లి తండ్రులు : శోభ, కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్)
భార్య : శైలిమ, కొడుకు - హిమాన్షు, కూతురు - మహాలక్ష్మి
సోదరి : కవిత (నిజామాబాద్ ఎంపీ)
చదువు :
► గుంటూరు విజ్ఞాన్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్
► నిజాం కాలేజీలో బీఎస్సీ మైక్రోబయాలజీ
► పుణె యూనివర్సిటీ నుంచి బయోటెక్నాలజీలో ఎమ్మెస్సీ
► న్యూయార్క్ సిటీ యూనివర్సిటీ నుంచి మార్కెటింగ్, ఈ-కామర్స్లో ఎంబీఏ
ఉద్యోగం : లాజిస్టిక్ కంపెనీ ఇంట్రాలో తొలుత పార్ట్ టైమ్ ఉద్యోగం, తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ అయ్యారు. సౌత్ ఏషియా రీజినల్ డైరెక్టర్గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.
రాజకీయ నేపథ్యం :
► 2009 లో సిరిసిల్లా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి స్వల్ప ఆధిక్యంతో ఎమ్మెల్యేగా విజయం.
►2014లో ఎమ్మెల్యేగా ఎన్నిక, తండ్రి కేసీఆర్ కేబినేట్ లో తొలుత ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి, జీహెచ్ఎంసీ ఎన్నికల అనంతరం పంచాయతీరాజ్ మార్చి మున్సిపల్ వ్యవహారాల శాఖ బాధ్యతలు చేపట్టడం.
ఆవార్డులు : ఇన్స్పిరేషనల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్, రిడ్జ్ స్కోచ్ చాలెంజర్ ఆఫ్ ది ఇయర్, ఐటీ మినిష్టర్ ఆఫ్ ది ఇయర్
- ఆర్ స్నేహలత (సాక్షి, జర్నలిజం స్కూల్)
Comments
Please login to add a commentAdd a comment