
సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీకి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘మంచి స్నేహితుడు, లోక్‌సభ సభ్యుడు అసద్ సాబ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు సంతోషం, ఆరోగ్యం, ప్రశాంతతతో సుదీర్ఘకాలం ప్రజా సేవలో కొనసాగాలి’ అని కేటీఆర్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
నాయినికి పుట్టినరోజు శుభాకాంక్షలు
మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డికి రెండురోజులు ఆలస్యంగా కేటీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘మాజీ హోం మంత్రి, ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మంచి ఆరోగ్యం, ప్రశాంతతతో మరెన్నో ఏళ్లు మీరు ప్రజా సేవలో కొనసాగాలి సర్’ అని ట్విట్టర్‌లో పోస్టు చేశారు. నాయిని ఆదివారం పుట్టినరోజు జరుపుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment