రంగారెడ్డి : తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంలో న్యాయమూర్తుల విభజన ప్రక్రియలో భాగంగా తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రా ప్రాంత న్యాయమూర్తులను నియమించడాన్ని వ్యతిరేకిస్తూ రంగారెడ్డి జిల్లా న్యాయవాదులు విధులకు హాజరు కాలేదు. ఈ సందర్భంగా జిల్లా కోర్టులో పనులు స్తంభించిపోయాయి. కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొత్త జనార్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో న్యాయమూర్తులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రా ప్రాంత న్యాయమూర్తులను నియమించడం వల్ల తెలంగాణ ప్రాంత న్యాయమూర్తులు అవకాశాలు కోల్పోతున్నారని మరోసారి ఉద్యమం చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.