భూగర్భ నీటి వినియోగానికి పరిమితి
194 గ్రామాల్లో కొత్త బోర్ల నిషేధం
త్వరలో అమలులోకి రానున్న విధానం
హన్మకొండ : వేసవి రాకముందే కష్టాలు మొదలయ్యూరుు. జిల్లాలో భూగర్భ నీటిమట్టం ప్రమాదకర స్థారుుకి చేరింది. దీంతో అందుబాటులో ఉన్న భూగర్భ నీటి నిల్వలకంటే ఇక్కడ వినియోగం ఎక్కువగా ఉండడంతో కొత్త బోర్లు వేయడాన్ని నిషేధించనున్నారు. ఈ మేరకు భూగర్భ నీటిమట్టం అంచనా కమిటీ(గ్రౌండ్ వాటర్ ఎస్టిమేషన్ కమిటీ, జీడబ్ల్యూఈసీ)కి సిఫార్సులు అందాయి. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి.
ఎక్కువైతే నిషేధమే
భూగర్భ జల నిల్వల కంటే నీటి వినియోగం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను దేశవ్యాప్తంగా గుర్తిస్తున్నారు. ఒక ప్రాంతంలో కురుస్తున్న సగటు వర్షపాతం ఆధారంగా ఆ ప్రాంతంలో ఉండే భూగర్భ నీటిమట్టం, అక్కడి నీటి వినియోగం తదితర సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని గ్రౌండ్ వాటర్ ఎస్టిమేట్ కమిటీ సేకరిస్తోంది. దీని ఆధారంగా ప్రాంతాలవారీగా భూగర్భ జల నిల్వలను అంచనా వేస్తారు. సగటు భూగర్భజల నిల్వలకు మించి నీటి వినియోగం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్త బోర్లకు అనుమతి ఇవ్వడం వల్ల పాత బోర్లకు నీటి లభ్యత తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఫలితంగా ఆ ప్రాంతంలో నీటి లభ్యతలో అసమానతలు ఏర్పడే అవకాశం ఉంది. దీంతో అందుబాటులో ఉన్న భూగర్భ నిల్వల కంటే నీటి వినియోగం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో కొత్త బోర్లు వేయడాన్ని నిషేధించాలని జీడబ్ల్యూఈసీ నిర్ణయించింది.
ఐదో వంతు ప్రాంతం
కేంద్ర భూగర్భ నీటిమట్టం అంచనా కమిటీ సూచనల ప్రకారం జిల్లా భూగర్భ జల వనరుల శాఖ అధికారులు 2011-12లో జిల్లావ్యాప్తంగా మొదటి దశ సర్వే చేపట్టారు. ఆ తర్వాత ఈ సమాచారాన్ని ఆ ప్రాంతంలో కురిసే సగటు వర్షపాతం, అక్కడి నేల స్వభావం తదితర అంశాలతో పలుమార్లు క్రోడీకరించారు. తుది ఫలితాల్లో జిల్లావ్యాప్తంగా 194 గ్రామాల్లో నీటి వినియోగం ఎక్కువగా ఉన్నట్లుగా తేలింది. దీంతో గ్రౌండ్ వాటర్ ఎస్టిమేషన్ కమిటీ నిబంధనల ప్రకారం ఈ ప్రాంతాల్లో కొత్తగా వ్యవసాయ, గృహ, వాణిజ్య అవసరాలకు సంబంధించి కొత్త బోర్లు వేయడాన్ని నిషేధిస్తారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి. జిల్లావ్యాప్తంగా 965 గ్రామ పంచాయతీలు ఉండగా.. వీటిలో 194 పంచాయతీలు ప్రమాదకర స్థాయిలో నీటి నిల్వలు తగ్గిపోయాయి. దాదాపుగా జిల్లాలో ఐదోవంతు ప్రాంతంలో కొత్త బోర్లు వేసేందుకు భవిష్యత్తులో అనుమతులు లభించవు.
జనగామలో అత్యధికం
జిల్లాలో జనగామ డివిజన్ తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతంగా పేరొందింది. ఇక్కడ చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు సైతం సకాలంతో రైతులకు అందుబాటులోకి రాలేదు. దీంతో ఈ డివిజన్ పరిధిలో రైతులు బోర్లపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. దీనికితోడు భూగర్భ నీటి వినియోగం పరిమితికి మించి తోడేస్తుండటంతో ఇక్కడ నీటి నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయి. జిల్లావ్యాప్తంగా 194 గ్రామాల్లో ప్రమాదకర స్థితిలో నీటి వినియోగం ఉందని గుర్తించగా.. వీటిలో 76 గ్రామాలు జనగామ రెవిన్యూ డివిజన్ పరిధిలోనే ఉన్నాయి. ముఖ్యంగా మద్దూరు మండలం పరిధిలో 20 గ్రామ పంచాయతీలు ఉండగా.. వీటిలో 18 గ్రామ పంచాయతీల్లో కొత్తగా బోర్లు వేయడాన్ని నిషేధించనున్నారు. వీటి తర్వాత జనగామ మండలంలో 12 గ్రామ పంచాయతీలు, బచ్చన్నపేట మండలంలో 11 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జిల్లాలో రెవిన్యూ డివిజన్లవారీగా ములుగు పరిధిలో 31, మహబూబాబాద్ పరిధిలో 23, వరంగల్ పరిధిలో 59, నర్సంపేట పరిధిలో 2 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
కొత్త బోర్లొద్దు..
Published Thu, Feb 19 2015 12:37 AM | Last Updated on Sat, Sep 2 2017 9:32 PM
Advertisement
Advertisement