సాక్షి, హైదరాబాద్: రోడ్ల నిర్మాణం చేసేటప్పుడు భద్రతా చర్యలు తీసుకునేలా కాంట్రాక్టర్లు, అధికారులకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై హైదరాబాద్‌కు చెందిన వి.బి.రామారావు రాసిన లేఖను న్యాయమూర్తుల కమిటీ పరిశీలించి ప్రజాప్రయోజన వ్యాజ్యంగా (పిల్) పరిగణించాలని నిర్ణయించింది.
ఈ పిల్‌ను మంగళవారం ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ప్రతివాదులైన కేంద్ర రవాణా శాఖ కార్యదర్శి, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రోడ్లు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి/ ఇంజనీర్ ఇన్ చీఫ్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సైబరాబాద్ కమిషనర్లకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. రోడ్ల నిర్మాణ సమయంలో ప్రజల భద్రతకు తీసుకున్న చర్యలు వివరించాలని ప్రతివాదుల్ని ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణ వచ్చే నెల 17కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment